హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైన్స్ ముందు మందుబాబుల క్యూ.. ఓపెన్ చేస్తామని చెప్పినా.. ఇదేంది స్వామి...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సరుకులు కొనుకునే ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ సారి వైన్స్‌కు కూడా అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటలకు క్లోజ్ చేయాలని స్పష్టంచేశారు. అయితే మందుబాబులు ఇప్పటినుంచే షాపుల వద్ద బారులు తీరారు.

లాక్ డౌన్ వల్ల లిక్కర్ ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మందుబాబుల వాదన. అలా ఎలా అధిక ధరకు విక్రయిస్తారని ప్రశ్నిస్తున్నారు. తమకు కరోనా సోకినా పర్వాలేదు.. కనీసం 10 బాటిళ్లు కొనుక్కోవాలని మందుబాబుల వాలకం చూస్తే అర్థమవుతోంది.

rush in wineshops in telangana due to lockdown

లాక్‌డౌన్ ప్రకటనతో జనం రోడ్డెక్కారు. హైదరాబాద్‌లో షాపులు కిక్కిరిసిపోయాయి. రంజాన్ కన్నా ముందు లాక్‌డౌన్ అమలు చేయడంతో పాతబస్తీ వాసుల్లో ఆందోళన నెలకొంది. ఇటు చార్మినార్ వద్ద రద్దీ బాగా కనిపిస్తోంది. రంజాన్ పండగ కోసం ముస్లిం సోదరులు షాపింగ్ చేస్తున్నారు.

మరోవైపు కొందరు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి ఉండదని.. గ్రామం బాట పట్టడం నయమని అంటున్నారు. గతేడాది కూడా చాలా మంది సొంత ఊర్లకు నడుచుకుంటూ వెళ్లారు. చాలా మంది మార్గమధ్యలోనే చనిపోయారు.

English summary
rush in wineshops in telangana state due to lockdown
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X