గుడ్ న్యూస్: 15వ తేదీ నుంచి రైతుబంధు.. బ్యాంకుల పేర్లు మారినందున..?
రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 15వ తేదీ నుంచే రైతుబంధు నిధులు అందచేయనుందని వివరించింది. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 2021, జూన్ 10వ తేదీ వరకు పట్టాదార్ పాస్ పుస్తకం పొంది సీసీఎల్ఏ ద్వారా..ధరణి పోర్టల్ లో చేర్చబడిన రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని.. అనుమాన పడొద్దని చెప్పారు.

ఆందోళన వద్దు..
రైతుబంధు నిధుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. అపోహకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తొలిసారి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల బ్యాంకు అకౌంట్ వివరాలు వ్యవసాయ అధికారులు సేకరిస్తారన్నారు. రైతులు స్థానిక ఏఈవోలను సంప్రదించాలన్నారు. రైతులు బ్యాంక్ అకౌంట్, పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు వివరాలు వ్యవసాయ అధికారులకు అందచేయాలన్నారు. ఇప్పటికే వారి వారి బ్యాంకు అకౌంట్లు సరిచూసుకోవాలని అధికారులు సూచించిన సంగతి తెలిసిందే.

బ్యాంకులు మారినా..?
ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు ఇతర బ్యాంకుల్లో విలీనం అయిన సంగతి తెలిసిందే. బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారుల అకౌంట్లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ మారాయి. ముందు జాగ్రత్తగా మరోసారి నూతన అకౌంట్ల నంబర్లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ నంబర్లను తీసుకుని ఆయా క్లస్టర్లకు చెందిన బ్యాంకు ఏఈవోలకు అందచేయాలని సూచించారు. జూన్ 10వ తేదీ వరకు సంబంధిత ఏఈవోలకు కొత్త పాస్ బుక్‌లతో పాటు..ఖాతా వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు.

పెట్టుబడి సాయం..
పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రైతుబంధు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వానాకాలం, యాసంగి రెండు పంటలకు నగదను ప్రభుత్వం జమ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని కేంద్రం కిసాన్ సన్మాన్ యోజన కింద రైతులకు పెట్టుబడి సాయం ఇస్తోంది.












Click it and Unblock the Notifications