హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతుబంధు: నేటి నుంచి అన్నదాతల ఖాతాలో జమ, తొలువ వీరికి, ఎంత మొత్తం అంటే

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక పథకం రైతు బంధు ఇవాళ్టి నుంచి జమ కానంది. యాసంగి సీజన్‌కు సంబంధించి సదరు రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. యాసంగి సీజన్​కు పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏడు విడతల్లో సుమారు 44 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశామని ఆయన తెలిపారు. ఈ సీజన్‌తో కలుపుకుని మొత్తం 50 వేల కోట్ల రూపాయలు రైతుబంధు పథకం కింద, అన్నదాతల ఖాతాల్లో జమ చేయడం పూర్తవుతోందని మంత్రి తెలిపారు.

ఇలా అర్హులు..

ఇలా అర్హులు..

డిసెంబరు 10 నాటికి ధరణి పోర్టల్‌లో పట్టాదారులు, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అందిన ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాదారులు, రైతుబంధు పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులని ప్రకటించారు. ఈ సీజన్‌లో 66 లక్షల మంది రైతులుకు సంబంధించిన 152 లక్షల ఎకరాలకు, 7వేల 645 కోట్ల రూపాయలు జమ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఎకరా నుంచి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగా, ఆరోహణ క్రమంలో నిధులు జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

 వావ్.. గ్రేట్

వావ్.. గ్రేట్

2018 నవంబరులో రోమ్‌ నగరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో AFAO రైతు బంధు పథకాన్ని ప్రశంసించిందని వివరించారు. రైతుబంధు నిధుల జమ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే, స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి సింగిరెడ్డి సూచించారు. మంగళవారం ఎకరాలోపు భూమి ఉన్నవారికి, బుధవారం 2 ఎకరాలు, గురువారం మూడెకరాలు.. ఇలా రోజూ ఎకరం చొప్పున పెంచుతూ రైతు ఖాతాల్లో నిధులు జమ చేస్తామని మంత్రి తెలిపారు.

 రూ.5 వేలు

రూ.5 వేలు

ఎకరా భూమికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తారు. పథకం 2018లో హుజురాబాద్‌లో ప్రారంభించారు. తొలుత రూ.ఎకరాకు 4 వేలు ఇచ్చారు. దానిని పెంచారు. ఈ నగదు.. రైతులకు పంట పెట్టుబడి, ఎరువులు, విత్తనాల విక్రయం కోసం ఉపయోగపడనుంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని.. పీఎం కిసాన్ సన్మాన్ యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక్కడ ఎకరా లెక్క కాకుండా ప్రతీ రైతుకు ఏడాదికి రూ.6 వేలను అందజేస్తారు.

English summary
rythu bandhu amount credited to farmers today. acre rs.5 thousand given by government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X