హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.7500 కోట్లు, కోటిన్నర ఎకరాలు.. రేపటినుంచే రైతుబంధు జమ

|
Google Oneindia TeluguNews

వానకాలం రైతుబంధు అన్నదాతల ఖాతాల పడబోతోంది. 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ముందుగా ఎకరం నుంచి మొదలుకొని చివరి ఎకరం భూమిదాకా పంటసాయం పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సీజన్‌కు 63,25,695 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మొత్తం 150.18 లక్షల ఎకరాలకు రైతుబంధు అందనుంది. ఇందుకోసం రూ.7,508.78 కోట్లు అవసరంకాగా, నిధులను ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులకు అందజేసింది.

కొత్త అర్హులు వీరే..

కొత్త అర్హులు వీరే..

గత యాసంగితో పోల్చితే ఈసారి రైతుబంధు అర్హుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 2,81,865 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. భూ విస్తీర్ణం కూడా పెరిగింది. కొత్తగా 66,311 ఎకరాలు రైతుబంధు పరిధిలోకి వచ్చింది. ధరణి పోర్టల్‌ వచ్చాక పార్టీ-బీలోని భూములు పార్ట్‌-ఏలోకి వచ్చాయి. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లు పరిష్కారమయ్యాయి. పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చిన పలు గ్రివెన్స్‌లతో కొత్త రైతులు, కొత్త భూములు రైతుబంధు కిందకు వచ్చాయి. ఈ ఏడాది వానకాలం, యాసంగి కోసం సీఎం కేసీఆర్‌ ఇప్పటికే రూ.14,800 కోట్లు కేటాయించారు. రైతుబంధు సాయం పొందడంలో నల్లగొండ జిల్లా టాప్‌లో ఉన్నది. జిల్లాలో 4,72,983 మంది అర్హులైన రైతులకు 12.18 లక్షల ఎకరాలకుగాను రూ.608.81 కోట్ల పంటసాయం జమచేయనున్నారు. అత్యల్పంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 39,762 మందికి 77 వేల ఎకరాలకు రైతుబంధు అందనున్నది.

రాబడి తగ్గినా..

రాబడి తగ్గినా..

ఏడాదిన్నర నుంచి కరోనా వల్ల రాష్ట్ర ఆర్థికవ్యవస్థ అస్థవ్యస్తంగా మారింది. రాబడి భారీగా తగ్గిపోయింది. అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ రైతుబంధు పంపిణీలో వెనుకడుగు వేయలేదు. వరుసగా ఏడోసారి రైతుబంధు కింద అన్నదాతకు పంటసాయం అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు రైతుల కోసం కేవలం రూ.వంద కోట్లు ఖర్చు చేయడానికే వెనుకాడుతుంటే తెలంగాణలో ఏకంగా రూ.7,508 కోట్లు రైతుల ఖాతాలో జమచేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా విపత్తులోనూ వరుసగా మూడోసారి రైతుబంధు నిధులు పంపిణీ చేస్తున్నారు.

అలర్ట్.. అలర్ట్... బ్యాంకుల విలీనంతో నో ప్రాబ్లమ్..

అలర్ట్.. అలర్ట్... బ్యాంకుల విలీనంతో నో ప్రాబ్లమ్..


ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, విజయ బ్యాంకు, దేనా బ్యాంకు, ఓరియంటల్‌ బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనమయ్యాయి. దీంతో అందులోని ఖాతాల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు మారాయి. ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న రైతులు తమకు రైతుబంధు పండుతుందో లేదోనని ఆందోళన చెందారు. బ్యాంకుల విలీనంతో సంబంధం లేకుండా రైతుల పాత ఖాతాల్లోకే రైతుబంధు నిధులు జమవుతాయని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ఎవరికైనా ఇబ్బంది తలెత్తితే ఏఈవోను సంప్రదించాలని సూచించారు.

Recommended Video

Rythu Bharosa Kendras : AP CM Jagan Started RBK Channel
రైతు బంధవుడు

రైతు బంధవుడు

ఈ సీజన్‌కుగానూ ఈ నెల 15 నుంచి రైతుబంధు పంపిణీ జరుగుతుంది. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వరుసగా ఏడోసారి రైతులకు పంటసాయం అందుతుంది. సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడు.. రైతుల పట్ల ఆయనకున్న ప్రేమ మరే సీఎంకు లేదు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతుబంధు పంపిణీకి వెనుకంజ వేయలేదని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

English summary
rythu bandhu amount deposit 15th of this month in farmers account minister niranjan reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X