Samantha:పిల్లలను కనాలనుకుంది.. శాకుంతలం వద్దనుకుంది..కానీ, నీలిమ గుణ

సామ్- చై.. డైవర్స్ అంశం హాట్ టాపిక్ అవుతోంది. విడిపోయిన అంశానికి సంబంధించి ఏ చిన్న అంశమయినా సరే చర్చకు దారితీస్తోంది. నాగచైతన్యతో విడిపోతున్నట్టు సమంత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సమంత గురించి దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చిత్రంలో నటిస్తుండగా, నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

 పిల్లలను కనేందుకు ఓకే..

పిల్లలను కనేందుకు ఓకే..

పిల్లల్ని కనేందుకు వీలుగా శాకుంతలం సినిమాను చేయకూడదని సమంత భావించిందని తెలిపారు. శాకుంతలం కథ విన్న తర్వాత కొన్ని షరతులతో సినిమా చేసేందుకు ఓకే చెప్పిందని వివరించారు "జులై, ఆగస్టు నాటికి సినిమా పూర్తి చేయాలని గుణశేఖర్‌ను కోరారని వివరించారు. శాకుంతలం సినిమా తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని పిల్లల్ని కనాలన్నది సమంత ఆలోచన అని పేర్కొన్నారు. తల్లి కావాలనే బలమైన కోరిక సామ్‌లో కనిపించిందని తెలిపారు. తన ఆలోచనలను మేం గౌరవించి, అందుకు అనుగుణంగానే శాకుంతలం చిత్రం షెడ్యూల్ రూపొందించాం అని వెల్లడించారు. అంతలోనే ఏదో జరిగిందని.. నాగచైతన్య, సమంత విడిపోయారని వివరించారు. ఈ పరిణామం ఊహించలేదని పేర్కొన్నారు.

 బాధాకరం..

బాధాకరం..

విడాకులు అనేది ఒకరి జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని సమంత తెలిపింది. ఈ బాధను ఒంటరిగా అనుభవించేందుకు తనకు సమయం, అవకాశం ఇవ్వాలని కోరింది. ఇలాంటి తప్పుడు కథనాలతో తనపై కనికరం లేకుండా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఎఫైర్లు, అబార్షన్లంటూ వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వాటిని తాను ఎన్నటికీ అంగీకరించేది లేదని.. ప్రామిస్ చేస్తున్నానని వివరించారు. ప్రచారంలో ఉన్నవన్నీ కట్టుకథలేనని సమంత వివరణ ఇచ్చారు.

అతనే కారణమా..?

అతనే కారణమా..?

నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారు విడిపోవడానికి సమంత స్టైలిష్ ప్రీతమ్ కూడా ఒక కారణం అంటూ అతగాణ్ణి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్, సమంతతో కలిసి ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ విషయం గురించి సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్.. వారి మధ్య ఉన్నది అక్కాతమ్ముళ్ల రిలేషన్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+