5 కాదు 31 కాదు.. 1వ తేదీ నుంచి స్కూల్స్ స్టార్ట్.. కొవిడ్ నిబంధనలు కంపల్సరీ
కరోనా నేపథ్యంలో.. స్కూళ్లకు సెలవులు పొడగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసులు స్థిరంగా ఉండటం, విద్యార్థులు అకడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 1వ తేదీ మంగళవారం నుంచి రాష్ట్రంలో స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

స్కూల్స్ ఓపెన్
సెలవులు ముగుస్తుండటం.. పాఠశాలలు తిరిగి ప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో సర్కార్ స్కూల్స్ తెరవాలని నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలు తెరవాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి రావడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. పదో తరగతి పరీక్షలు కూడా సమీపిస్తున్నందున పాఠశాలలు తెరవాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

8వ తేదీ నుంచి హాలీడేస్
కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వ్యాప్తితో రాష్ట్రంలో కేసులు పెరగడం వల్ల ప్రభుత్వం ఈ నెల 8 నుంచి విద్యాసంస్థలను మూసివేసింది. అప్పటి నుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత కేసుల పెరుగుదల ఆగకపోవడంతో ఆ సెలవులను 30 వరకు పొడిగించారు. 15 ఏళ్లు దాటిన వారికి టీకా పంపిణీ, విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి టీకా ఇవ్వడం.. మరోవైపు జ్వర సర్వే పూర్తవ్వడం వల్ల కరోనా వ్యాప్తి తీరును అంచనా వేసిన సర్కార్.. విద్యాసంస్థలు తెరిచేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఆన్ లైన్ తరగతులు
8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇవి ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదనే వాదనలు వినిపిస్తుండటం.. తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఇప్పటికే ఇంటర్, పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. వార్షిక పరీక్షల నిర్వహణపై కూడా షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సెలవులు కొనసాగుతుండటం వల్ల పరీక్షలపై ఇంకా తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు. విద్యా సంస్థలను తెరిచిన వెంటనే వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

కరోనా తగ్గుముఖం
పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో స్కూల్స్ రీఓపెన్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్కూల్స్ రీ ఓపెనింగ్‌పై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. పాఠశాలలు తెరవడం కోసం ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ.. నిపుణుల బృందాన్ని ఆదేశించినట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలకు త్వరలోనే పంపించనున్నట్టు వివరించాయి.

కొన్ని చోట్ల ఓపెన్
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్కూల్స్‌ను మళ్లీ తెరవడంపై నిర్ణయం తీసుకున్నాయి. పదో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులను కొన్ని షరతులతో తరగతులకు హాజరు కావచ్చని తెలిపాయి. 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న విద్యార్థులు కనీసం ఒక్క డోసు అయినా తీసుకోవాలనే కండీషన్స్ పెట్టాయి.18 ఏళ్లు పైబడిన విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తప్పకుండా రెండు డోసుల టీకా తీసుకోవాలని స్పష్టం చేశాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications