గూగుల్‌లో సర్చ్ చేసి హత్య..ఇస్రో సైంటిస్ట్ కేసులో కొత్త ట్విస్టు.. స్వలింగ సంపర్కంతో
సైంటిస్ట్ సురేష్ హత్యకేసును పోలీసులు ఛేధించారు. హోమో సెక్సువల్, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలిపారు. శాస్త్రవేత్త సురేష్‌తో నిందితుడు శ్రీనివాస్ స్వలింగ సంపర్కం కొనసాగించాడని పోలీసుల విచారణలో తేలింది. సురేష్ ఫోన్‌కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపడితే అసలు విషయం వెలుగులోకి వచ్చిందని వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి తెలిపారు.
హైదరాబాద్ అమీర్‌పేట ధరమ్ కరమ్ రోడ్డులో సైంటిస్ట్ సురేష్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే అతను ఒంటిపై బట్టలు లేకుండా ఉండటం, సమీపంలో ఆయిల్ బాటిల్ లభించడంతో అతను గే అని పోలీసులు అనుమానించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా శ్రీనివాస్ అనే వ్యక్తి 2 నెలలుగా ప్లాట్‌కి వచ్చి వెళ్తున్నట్టు గుర్తించారు. శ్రీనివాస్ అమీర్‌పేటలోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ల్యాబ్లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు.

సురేష్ భార్య చెన్నైలో పనిచేస్తున్నారు. 2005 నుంచి ఆమె అక్కడే ఉండటంతో నగరంలో సురేశ్ ఒక్కరే ఇక్కడ ఉంటున్నారు. మరోవైపు భార్యభర్తల మధ్య చాలారోజుల నుంచి సంబంధాలు సరిగా లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో సురేశ్‌కు శ్రీనివాస్ దగ్గరయ్యాడు. వారిద్దరూ స్వలింగ సంపర్కం చేసుకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. అయితే తనకు డబ్బులు ఇవ్వాలని శ్రీనివాస్ అడగడంతో ఇద్దరి మధ్య వివాదానికి కారణమైంది. అందుకు సురేష్ నిరాకరించడంతో.. హత్యకు దారితీసింది. సురేష్‌ను ఎలా చంపాలనే అంశంపై శ్రీనివాస్ గూగుల్‌లో కూడా సెర్చ్ చేసినట్టు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన శ్రీనివాస్‌ను విచారించడంతో అసలు విషయం వెలుగుచూసిందని వెస్ట్ జోన్ డీసీపీ సుమతి పేర్కొన్నారు. సురేష్ భార్య ఫిర్యాదు ఆదారంగా శ్రీనివాస్‌పై చర్యలు తీసుకుంటామని వివరించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications