గంజాయిపై ఉక్కుపాదం: కేసీఆర్, అక్కడ వారే ఇస్తున్నారు: చాడ
హుజురాబాద్ బై పోల్ వేళ కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే గుడుండాపై నిషేధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గంజాయి అక్రమ సాగుపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. పరిస్థితి తీవ్రతరం కాకముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు.
డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక స్థితి దెబ్బతింటుందని కేసీఆర్ వివరించారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారు ఆత్మహత్యలకు కూడా పాల్పడే అవకాశం ఉందన్నారు. డ్రగ్స్, గంజాయి వినియోగించే వారు ఎంతటివారైనా ఉపేక్షించొద్దని చెప్పారు. వీటిని నియంత్రించేందుకు డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలని తెలిపారు. ఇంటెలిజెన్స్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని అన్నారు.

డ్రగ్స్ గంజాయిపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీచేశారు. అయితే దీనిపై సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి స్పందించారు. హుజురాబాద్‌లో కొత్తగా గంజాయి ఇచ్చి ఓట్లు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. హుజురాబాద్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగట్లేదని పేర్కొన్నారు. దుర్మార్గపు ఎన్నికలు జరుగుతున్నాయని విమర్శించారు. దేశ భవిష్యత్‌ను పాడుచేసే విధంగా ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగాలను తక్కువకే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రైతులను బజారుపాలు చేసే చట్టాలు తెచ్చారని ధ్వజమెత్తారు. మోడీ పాలనలో రైతుల బతుకులు దారుణంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతి అసలే లేదని చాడ వెంకట్‌రెడ్డి తప్పుబట్టారు.
హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.












Click it and Unblock the Notifications