షర్మిల ప్రశ్నించిన మరునాడే కొలువుల ప్రకటన, బై ఎలక్షన్ ఫీటా..?
50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్నీ విభాగాల్లో ఖాళీల ఆధారంగా కొలువుల అని చెప్పారు. ఇదీ నిజంగా కేసీఆర్ వేశారా.. లేదంటే మరే కారణం ఉందా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే నిన్న షర్మిల విమర్శలు గుప్పించారు. ఆ మరునాడే ఖాళీల భర్తీ అనే ప్రకటన రావడంతో సందేహాం కలుగుతుంది.
కేసీఆర్ ఫ్యామిలీకి ఉపాధి కలిగిందని షర్మిల వైఎస్ఆర్ టీపీ ఆవిర్భావ సభలో విమర్శించిన సగతి తెలిసిందే. నలుగురికి ఉద్యోగం వచ్చిందని మరీ నిరుద్యోగుల సంగతి ఏంటీ అని అడిగారు. బీఎడ్, నర్స్, పోలీస్, క్లర్క్ కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఉన ఎన్నిక వస్తే చాలు త్వరలో ఉద్యోగాలు అనే ప్రకటన చేస్తారు. కోచింగ్ పూర్తయిన జాబ్ లేదు. స్కిల్ డెవలప్ మెంట్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యిందని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వని మోసగాడు కేసీఆర్ అని ఫైరయ్యారు.

ఇదే అంశంపై బీజేపీ నేత విజయశాంతి కూడా విమర్శలు చేశారు. ఆమె చేసిన ఆరోపణల్లో నిజం ఉంది. షర్మిల పార్టీ ప్రకటన తర్వాత కూడా ప్రకటన రావడంతో కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. కేసీఆర్‌లో కుదుపునకు కారణం.. షర్మిలనేనా అనే అనుమానం కలుగుతుంది. లేక నిజంగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి.
Recommended Video
ఏదీ ఏమైనప్పటికీ 50 వేల కొలువులు భర్తీ చేస్తానని చెప్పడం మాత్రం నిజంగా మంచి పరిణామమే. కొలువుల కోసం చూస్తున్న నిరుద్యోగుల పాలిట అదీ కల్పవల్లిగా మారనుంది. వారి ఆశలు ఇకనైనా తీరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications