She Teams: మహిళలను వేధించిన 285 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..!
హైదరాబాద్ లో షీ టీమ్స్ చాలా ప్రభావ వంతంగా పని చేస్తున్నాయి. మహిళలను వేధిస్తున్న వారి తాటా తీస్తున్నాయి. సిటీలో ఎక్కడ వేధింపులు జరిగినా షీ టీమ్స్ రంగ ప్రవేశం చేస్తున్నాయి. గత ఏడు రోజుల్లో ఖైరతాబాద్ బడా గణనాథుడి వద్ద మహిళా భక్తులతో అసభ్యంగా ప్రవర్తించిన 285 మందిని షీ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ బుధవారం వీరిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
ఖైరతాబాద్ తోపాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్న గణేశ్ మండపాలు, హుస్సేన్‌సాగర్, చెరువుల వద్ద షీ టీమ్ పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. ఎవరైనా వేధిస్తే వెంటనే డయల్100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 94906 16555కు సమాచారం ఇవ్వాలని విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత కోరారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్బంగా పోలీసులు పలు సూచనలు చేశారు. ఈ సూచనలు తప్పక పాటించాలని కోరారు.

గణేష్ విగ్రహ నిమజ్జనానికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు పేర్కొన్నారు. గణేష్ విగ్రహం తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్లు ఉండకూడదని స్పష్టం చేస్తున్నారు. గణేశ్ విగ్రహం తీసుకెళ్లే వాహనంలో మద్యం లేదా ఏ ఇతర మత్తు పదార్థాలు ఉండరాదని వివరించారు. గణేశ్ విగ్రహ నిమజ్జనం కోసం వచ్చే వారు కర్రలు, ఏ ఇతర ఆయుధాలు తీసుకురావొద్దని కోరారు. జెండాలకు ఉపయోగించే కర్రలు రెండు అడుగుల పొడవు మాత్రమే ఉండాలని చెప్పారు.
వెర్మిలియన్, కుంకుమ లేదా గులాల్ పాదచారులపై వేయకూడదన్నారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జనం ఊరేగింపులో రాజకీయ, రెచ్చగొట్ట ప్రసంగాలు చేయకూడదన్నారు. ఊరేగింపు సమయంలో బాణసంచా పేల్చరాదని సూచించారు. ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications