గచ్చిబౌలి స్టేడియంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఊహించని షాక్...
తెలంగాణ క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో టోక్యో ఒలింపిక్స్‌కి వెళ్లే క్రీడాకారులు,కోచ్‌లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సన్మాన వేళ వేదిక పైకి వెళ్లేందుకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సహా పలువురు క్రీడాకారులు,కోచ్‌లు నిరాకరించారు.
వేదికపై ఎక్కువ మంది ఉన్నారన్న కారణంతో స్టేజీ ఎక్కేందుకు వారు నిరాకరించారు.కరోనా వేళ ఇంతమందిని స్టేజీ ఎక్కించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులు,కోచ్‌లకు సర్దిచెప్పడంతో స్టేజీ పైకి వెళ్లారు. ఈ సందర్భంగా వారికి పుష్ప గుచ్ఛం అందించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

టోక్యో ఒలింపిక్స్‌లో దేశం తరుపున సత్తా చాటాలని... పతకాలు సాధించాలని శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. దేశమంతా గర్వపడేలా చేయాలన్నారు. తెలంగాణలో క్రీడల అభివృద్ది,సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ప్రోత్సహకాలు ప్రకటించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇప్పటివరకూ క్రీడాకారులకు రూ.25.87కోట్ల నగదు ప్రోత్సాహకాలు అందించామన్నారు.
షెడ్యూల్ ప్రకారం జపాన్‌లోని టోక్యోలో గతేడాది ఒలింపిక్ క్రీడలు జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని విదేశీ అభిమానులను స్టేడియంలోకి అనుమతించవద్దని నిర్ణయించారు.కేవలం జపాన్ అభిమానులనే స్టేడియంలోకి అనుమతించనున్నారు. ఒకవేళ ఎవరైనా అథ్లెట్లు కోవిడ్ పాజిటివ్‌గా తేలితే వారు ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఒలింపిక్స్‌కి వెళ్లే క్రీడాకారులు అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో నిబంధనలు పాటించకపోవడంపై క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video
జులై 23 నుంచి అగస్టు 8 వరకు జరగనున్న ఒలింపిక్స్ ఈవెంట్‌లో భారత్ తరుపున మొత్తం 115 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications