Trains cancelled: రైల్వే ప్రయాణికులకు గమనిక.. పలు రైళ్లు రద్దు..

ఇంటర్ లింకింగ్ పనుల కారణంగా మే 6, 8, 9 తేదీల్లో రైల్వే కొన్ని రైళ్లను పాక్షికంగా, మరి కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. మే 6, 8 తేదీల్లో కాచిగూడ-విశాఖపట్నం రైలు (12862) రద్దు చేయగా, మే 8న సికింద్రాబాద్-రాయ్‌పూర్ (12771), రాయ్‌పూర్-సికింద్రాబాద్ (12772), దర్భంగా-సికింద్రాబాద్ (17008) డివిజన్‌ల మధ్య రైళ్లు పాక్షికంగా రద్దు చేశారు. రైల్వే ప్రయాణికులు షెడ్యూల్‌లో మార్పును గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

వేసవి రద్దీ కారణంగా దక్షిణ మధ్య్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. నంబర్ 03226 రైలు సికింద్రాబాద్-దానాపూర్ రూట్‌లో మే 7 నుంచి జూలై 2 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 10.00 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతరోజు సాయంత్రం 7.00 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.

 train

నంబర్ 07189 రైలు నాందేడ్-ఈరోడ్ మార్గంలో ఏప్రిల్ 21 నుంచి జూన్ 30వ తేదీవరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు నాందేడ్‌లో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు ఈరోడ్ చేరుకుంటుంది. నంబరు 08585/08586 రైలు విశాఖపట్నం-మహబూబ్‌నగర్‌ మధ్య ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రతి మంగళవారం జూన్‌ 28వ తేదీ వరకు నడుస్తుంది.

విశాఖపట్నంలో ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు మహబూబ్‌నగర్‌లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. నంబర్ 08543/08544 రైలు విశాఖపట్నం-బెంగళూరు ఈ నెల 7వ తేదీ నుంచి 29వ తేదీ వరకు విశాఖపట్నంలో మధ్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరు చేరుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+