Specail Trains: హైదరాబాద్, కటక్ మధ్య 10 ప్రత్యేక రైళ్లు.. ఎప్పుడెప్పుడంటే..!
వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని దక్షిణామధ్య రైల్వే పలు ప్రాంతాలుక ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ, వేసవి సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సీహెచ్.రాకేశ్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ నుంచి రాగ్జల్, సికింద్రాబాద్ నుంచి దలనపూర్ మధ్య జూన్ 3 నుంచి జూన్ 26 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు చెప్పారు.
అలాగే హైదరాబాద్, కటక్ మధ్య 10 వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతామని చెప్పారు. హైదరాబాద్ - కటక్ (07165) రైలు మే 30, జూన్ 6, 13, 20, 27 తేదీల్లో నడుస్తుంది. కటక్ -హైదరాబాద్ (07166) రైలు మే 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో నడుస్తుంది. ఈ ప్రత్యేక రైళ్లలో AC II టైర్, AC III టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని దక్షిణా మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటికే రైల్వే శాఖ ఏప్రిల్ 19 నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జూలై 2 వరకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

రైలు నంబర్ 03226 సికింద్రాబాద్-దానాపూర్ కు ప్రస్తుతం ప్రత్యేక రైలు నడుస్తోంది. జూలై 2 వరకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 10.00 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతరోజు సాయంత్రం 7.00 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్‌షా, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కత్నీ, సాట్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, బక్సర్, ఆరా స్టేషన్లలో ఆగుతోంది.
నాందేడ్ నుంచి ఈరోడ్ కు నెంబర్ 07189 గల ప్రత్యేక రైలు జూన్ 30వ తేదీవరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు నాందేడ్‌లో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు ఈరోడ్ చేరుకుంటుంది. ఈ రైలు ముధ్‌ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూగ్, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం రైల్వే స్టేషన్లలో ఆగుతోంది.
అలాగే కాచిగూడ నుంచి తిరుపతి, కాచిగూడ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. కాచిగూడ తిరుపతి ప్రత్యేక రైలు నిన్నటి వరకు నడిచింది. కాచిగూడ కాకినాడ రైలు మే 27న కాచిగూడలో రాత్రి 8.45కు బయలుదేరి 28న ఉదయం 8.45కు కాకినాడ చేరుకుని అదే రోజు రాత్రి 9.55కు కాచిగూడకు బయలుల్దేరుతుంది. సోమవారం అంటే 29న ఉదయం 9.45కు కాచిగూడ చేరుకుంటుంది. రైళ్లు కాజీపేట, వరంగల్, మహబాబూబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగనున్నాయి.
-
హోటల్ మేనేజ్మెంట్ లో ఆన్ లైన్ శిక్షణ, ఉద్యోగాలు- అర్హతలు..!! -
హాట్ సమ్మర్ లో ఈ కూల్ ప్రదేశాలను చుట్టేయండి.. హైదరాబాద్ కు దగ్గరలోనే.. -
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..?












Click it and Unblock the Notifications