తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక బస్సులు.. ఈ సారి తగ్గిన సర్వీసులు,
సంక్రాంతి వచ్చేసింది. మరో వారం రోజుల్లోనే పండగ.. ఏపీలో అయితే పండగ శోభ అయితే మాములుగా ఉండదు. అయితే ఈ సారి కరోనా, ఒమిక్రాన్ హడలెత్తిస్తున్నాయి. అయినప్పటికీ ఊర్లకు వెళ్లేవారు ఏం తక్కువ లేరు. ఎప్పటిలాగే సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సంస్థలు అదనపు బస్సులను నడుపుతుంటాయి. ఈ సారి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి 984 ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది.

స్పెషల్ బస్సులు
ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఏపీలోని 13 జిల్లాల్లో గల వివిధ పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో టీఎస్ఆర్‌టీసీ 4 వేల 980 బస్సులు నడపగా.. ఈ ఏడాది 4 వేల 318 బస్సులను నడిపుతున్నామని ప్రకటించింది. బస్సులను హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, ఎంజీబీఎస్, ఎల్‌బీనగర్, జీడిమెట్ల, జేబీఎస్, ఈసీఐఎల్ నుంచి నడుపున్నట్లు వెల్లడించింది.

అదనపు వసూళ్లు
గతంలో సంక్రాంతికి బస్సులు ఎక్కువ రేటుతో నడిచేవి. ఇప్పుడు మాత్రం ఎలాంటి అదనపు వసూళ్లు లేకుండా బస్సులను నడపనున్నట్లు ఆర్‌టీసీ ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా స్పెషల్ బస్సులను అదనంగా ఏర్పాటు చేయగా.. వాటికి రిజర్వేషన్ ఉంటుందని అధికారులు చెప్పారు. రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు వైపు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్ బయట ఉన్న ఓల్డ్ సీబీఎస్ హాంగర్ నుంచి బయలుదేరతాయి. సంక్రాంతికి నడిచే ఏపీఎస్ఆర్టీసీ బస్సులపై అదనపు చార్జీలు వసూలు చేస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. ఏపీకి వెళ్లేవారు తెలంగాణ బస్సులు ఎక్కేలా ప్లాన్ చేస్తుంది.

రైళ్లు కూడా
ఇటు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 10 ప్రత్యేక రైళ్లు.. జనవరి 7వ తేదీ నుంచి 22వ తేదీల మధ్య నడవనున్నట్లు ప్రకటించింది. జనవరి 7, 14వ తేదీల్లో కాచిగూడ-విశాఖపట్నం, 8, 16న విశాఖపట్నం-కాచిగూడ, 11వ తేదీన కాచిగూడ-నర్సాపూర్, 12న నర్సాపూర్- కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్- లింగంపల్లి, 20, 22న లింగంపల్లి - కాకినాడ టౌన్ మధ్య స్పెషల్ ట్రైన్లు నడవబోదున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఇక్కడ ఆగనుంది
కాచిగూడ -విశాఖ స్పెషల్ ట్రైన్ మల్కాజ్‌గిరి, చర్లపల్లి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడ- నర్సాపూర్ ట్రైన్ మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగనుంది.

14 రైళ్లు
కాకినాడ టౌన్- లింగంపల్లి రైలు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలకు ప్రత్యేకంగా 14 రైళ్లు నడవనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. కాకినాడ టౌన్-లింగంపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు తిరుగుతాయి. పండగ పూర్తయిన తర్వాత కూడా తిరిగి వర్క్ ప్లేస్ చేరుకునేందుకు రైళ్లను నడుపుతుంది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications