అరుణ్-స్వప్న మధ్యలో ప్రశాంత్, స్నానం చేస్తుండగా వీడియో, ఫేక్ మొబైల్ నంబర్‌తో గుట్టురట్టు..
హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన వివాహిత ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అల్లుడే హత్యచేశారని బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందనే అంశంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. స్వప్న-అరుణ్ మధ్యలో ప్రశాంత్ అనే యువకుడి పేరు ఎందుకు తీసుకొచ్చారని, భార్యను హత్య చేయడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

స్నానం చేస్తుండగా వీడియో
ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో స్వప్న-అరుణ్ దంపతులు ఉండేవారు. అయితే స్వప్న స్నానం చేస్తుండగా ప్రశాంత్ అనే యువకుడు వీడియో తీశాడని అప్పట్లో ఎస్ఆర్ నగర్ పోలీసులను అరుణ్ ఆశ్రయించారు. అంతేకాదు తన భార్య చేత ఫిర్యాదు చేయించాడు. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు అరుణ్ ఇచ్చిన మొబైల్ నంబర్ ఫేక్ అని గుర్తించారు.

పీఎస్‌లో కంప్లైంట్..
ప్రశాంత్ వీడియో తీశారని, అరుణ్ ఇచ్చిన మొబైల్ నంబర్ తప్పు అని విచారణలో తేలింది. దీంతో ప్రశాంత్ పేరుతో అరుణే నాటకం ఆడారని స్వప్న బంధువులు అంటున్నారు. దీంతో స్పప్న బంధువులకు నిజం బోధపడింది. అరుణ్ నాటకం ఆడారని, స్వప్నను హతమార్చింది అతనేనని పోలీసులను ఆశ్రయించారు. అరుణ్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

అరుణే తీశాడా..?
అరుణ్ తన భార్య వీడియో తీసి షేర్ చేసి ఉంటారని భావిస్తున్నారు. అలా తెరపైకి మరో యువకుడి పేరు తీసుకురావడంతో.. అవమానానికి గురై స్వప్న ఆత్మహత్య చేసుకొని ఉంటుంది. లేదంటే స్వప్నను అరుణే హతమార్చి కథ అల్లారని బంధువులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications