ఓ శ్రావణి కథ.. దేవ్‌రాజ్ రెడ్డి, సాయికృష్ణ రెడ్డి.. కొత్తగా ఆర్ఎక్స్-100 నిర్మాత పేరు..?

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. శ్రావణి సూసైడ్ చేసుకున్న వెంటనే తెరపైకి టిక్ టాక్ స్టార్ దేవ్‌రాజ్ రెడ్డి పేరు వినిపించింది. అతనే వేధించడాని శ్రావణి పేరంట్స్ బల్లగుద్దీ మరీ చెప్పారు. ఆ మేరకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కానీ మలుపులు తిరిగి తిరిగి.. ఇప్పుడు ఆర్ఎక్స్-100 నిర్మాత పేరు తెరపైకి వచ్చింది. దీంతో శ్రావణి ఆత్మహత్యతో అతనికి ఏం సంబంధం అనే ప్రశ్న సామాన్యుల మెదడును తొలచివేస్తోంది.

తొలుత దేవ్‌రాజ్ పేరు..

తొలుత దేవ్‌రాజ్ పేరు..

మంగళవారం అర్ధరాత్రి సమయంలో శ్రావణి తన ఇంటి బాత్ రూంలో ఆత్మహత్య చేసుకుంది. ఆ వెంటనే తెరపైకి దేవ్ రాజ్ రెడ్డి పేరు వచ్చింది. కానీ అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో సాయి పేరుతో ఆరోపణలు చేశాడు. అందరి ముందు దాడి చేశాడని.. శ్రావణి వాపోయిందని చెప్పారు. కానీ సాయి కూడా కౌంటర్ ఇచ్చాడు. మరో వీడియో రిలీజ్ చేసి.. తాను సచ్చిలుడినని చెప్పుకున్నాడు. ఈ కేసు విచారణను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. ఎంక్వైరీ చేస్తున్నారు.

సాయిపై ఆరోపణలు.. పీఎస్‌లో విచారణ

సాయిపై ఆరోపణలు.. పీఎస్‌లో విచారణ

ఇవాళ దేవ్‌రాజ్, సాయిని పీఎస్‌కు ఎస్ఆర్ నగర్ పోలీసులు పిలిపించారు. శ్రావణి ఆత్మహత్యపై ప్రశ్నలు గుప్పించారు. ఎప్పటినుంచి తెలుసు.. ఎలా తెలుసు.. చివర ఎప్పుడు మాట్లాడారు అని అడిగారు. ఇద్దరిపై అరగంట పాటు ప్రశ్నల వర్షం కొనసాగింది. అయితే ఈ సమయంలో ఆర్ ఎస్ 100 నిర్మాత అశోక్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దేవ్ రాజ్, సాయి ఆరోపణల నేపథ్యంలో.. అశోక్ రెడ్డి పేరు వచ్చింది. కానీ అతని పేరు వినిపించడానికి ఇప్పటివరకు స్పష్టమైన కారణం ఏమీ తెలియలేదు. విచారణ క్రమంలో నిజనిజాలు తెలిసే అవకాశం ఉంది.

 తెరపైకి అశోక్ రెడ్డి పేరు..

తెరపైకి అశోక్ రెడ్డి పేరు..

మనసు మమత, మౌనరాగం సీరియళ్లతో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో శ్రావణి ఆత్మహత్య ప్రతీ ఒక్కరినీ కలిచివేస్తోంది. గత 8 ఏళ్లుగా ఆమె టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. ఆత్మహత్య విషయం తెరపైకి రాగా.. పలువురు కో ఆర్టిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆమె మృతితో మాత్రం అనుమానితుల సంఖ్య పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+