హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశంలోనే ది బెస్ట్ అనిపించుకున్న కేటీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ప్రస్తుతం స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్నారు. దావోస్ లో ఏర్పాటైన ప్రపంచ ఆర్థిక సదస్సు సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా- ఆయన అత్యున్నత స్థాయి సమ్మిట్ లో పాల్గొంటోన్నారు. వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను కలుసుకుంటోన్నారు. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి వివరిస్తోన్నారు.

అదే సమయంలో.. కేటీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించే టీ-హబ్ కు ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటర్ గా గుర్తింపు పొందింది. బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ఇండియా అవార్డును సొంతం చేసుకుంది. జాతీయ స్టార్టప్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ రంగంలో అత్యుత్తమ పనితీరును కనపర్చిన వాటికి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇచ్చే అవార్డు ఇది. 2020లో ఈ అవార్డును ప్రారంభించింది.

Startup enabler T-Hub won the Best Incubator in India award at the National Startup Awards 2022

2022 సంవత్సరానికి దీన్ని టీ-హబ్ సొంతం చేసుకుంది. స్టార్టప్ ఎనేబుల్ టీ-హబ్.. దేశంలోనే ఉత్తమ ఇంక్యుబేటర్ గా నిలిచినట్లు ప్రకటించింది. ఈ అవార్డు రావడం ఇది మూడోసారి. ఈ ఏడాది 17 సెక్టార్లు, 50-సబ్ సెక్టార్లు, ఏడు ప్రత్యేక కేటగిరీలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ అవార్డు కోసం టీ-హబ్ ను ఎంపిక చేసింది. 2,600 కంటే ఎక్కువ స్టార్టప్స్ ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుంచి 55 ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు ఈ అవార్డు కోసం పోటీ పడ్డాయి.

ఫైనల్స్ కు ఎంపిక చేసిన షార్ట్ లిస్ట్ లో 124 కంపెనీలు నిలిచాయి. 2022లో ఐటీ కంపెనీలను నెలకొల్పడంతో పాటు తెలంగాణలో స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి చేయడంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం- ఈ కేటగిరీలో టీ-హబ్ ను విజేతగా ప్రకటించింది. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, ఆ శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ సమక్షంలో ఈ ఇన్నోవేషన్ అవార్డును ప్రదానం చేశారు.

టీ-హబ్ కు ఈ అవార్డు లభించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానాలు, ఐటీ ఎగుమతులు, పెట్టుబడులను ఆకర్షించడానికి చేస్తోన్న ప్రయత్నాలకు ఈ అవార్డు- అత్యుత్తమ నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ దూకుడును కొనసాగిస్తామని, స్టార్టప్ కంపెనీలకు మరింత నాణ్యమైన సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌ని ఎలివేట్ చేయడంలో టీ-హబ్ కీలక పాత్ర పోషించిందని, ఇది తమకు గర్వకారణమని టీ-హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం శ్రీనివాస్ రావు అన్నారు.

English summary
Startup enabler T-Hub won the ‘Best Incubator in India’ award at the National Startup Awards 2022 on National Startup Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X