Hyderabad: బయటకొస్తున్నారా.. జాగ్రత్త.. వైరల్ అవుతోన్న వీడియో..

హైదరాబాద్ లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దాడులు చేస్తూ గయపరుస్తున్నాయి. మణికొండలో వీధి కుక్కలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కలు మణికొండ శ్రీనివాస వీధి కాలనీలో రెండు రోజుల్లో నలుగురిపై దాడి చేశాయి. ఓ బాలుడిపై కుక్క దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ బాలుడు షాపు నుంచి బయటకు వస్తున్నాడు. అక్కడే ఓ కుక్క ఉంది. అతను బయటకు వస్తుండగా.. దాడి చేసింది.

అతన్ని పళ్లతో గట్టిగ పట్టుకుంది. అక్కడున్నవారు కుక్కను తమిరిమికొట్టే ప్రయత్నం చేసినా అది విడిచిపెట్టాలేదు. మరో వైపు బాలుడు కాపాడండి అంటూ అరుస్తున్నాడు. చివిరికి కుక్కను తరిమికొట్టారు. అతని గాయాలు అయ్యాయి. అయితే ఘటన మరవకముందే శంషాబాద్ లో ఏడాది వయస్సున్న బాలుడిపై వీధి కుక్కలు దాడులు చేశాయి. ఈ దాడిలో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Stray dog attacks on the rise in Hyderabad

కొన్ని నెలల క్రితం హైదరాబాద్ అంబర్ పేటలో కూడా వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. వీధి కుక్కల నియంత్రణలో జీహెచ్ఎంసీ విఫలమైందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే అప్పుడు జీహెచ్ఎంసీ తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంది. దీంతో వీధి కుక్కలు దాడులు కొనసాగాయి. చాలా చోట్ల ప్రజలు వీధి కుక్కల భయంతో బయటకు రావడానికి జంకుతున్నారు.

వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రంలో కూడా వీధి కుక్కల దాడులు పెరిగాయి. కొద్ది నెలల క్రితం ఖాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో వీధి కుక్కలు బాలుడిపా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో బాలుడు మృతి చెందాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+