హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎండల ఎఫెక్ట్ : సృహ తప్పిన నెమలి, సెలైన్ ఎక్కించి, కాపాడిన ’మనుషులు‘

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు ఠారెక్కిస్తున్నాయి. భానుడి భగభగలతో జనాలే కాదు మూగజీవాలు కూడా అల్లాడుతున్నాయి. ఉదయం 7 నుంచి మొదలవుతోన్న వేడి .. సాయంత్రం వరకు ఉంటుంది. దీంతో సేదతీరేందుకు వాటికి మునుపటిలా అటవీ కూడా లేదు. దీంతో బయటకొస్తున్న పక్షులు ఎండలతో మాడిపోతున్నాయి. ఎక్కడ నీరు కనిపిస్తే అక్కడికెళ్లి సేదతీరుతున్నాయి.

మానవత్వం పరిమళించింది

మానవత్వం పరిమళించింది

'మనుషులు‘ మానవత్వం మరచిపోయి చాలారోజులైంది. తమ పక్కన వారికి ఎవరైనా పట్టించుకునే నాథుడే లేడు. ఇక పక్షుల సంగతి దేవుడేరుగు. కానీ జనగామ జిల్లాలో మాత్రం 'మనుషులు‘ స్పందించారు. ఎండలతో విలవిలలాడిన నెమలికి స్వాంతన చేకూర్చి ... కాపాడారు. తమలో ఇంకా మానవత్వం ఉందనే విషయాన్ని ప్రపంచానికి చాటారు.

సృహ తప్పిన నెమలి ..

సృహ తప్పిన నెమలి ..

జనగామ జిల్లా శివారులో జాతీయ పక్షి నెమలి బయటకొచ్చింది. శివారులోకి వచ్చిన నెమలి .. వేడి తట్టుకోలేకపోయింది. ఏం చేయాలో .. ఏటు వెళ్లాలో తెలియలేదు. ఇంతలో ఓ బోరు వద్ద నీరు ప్రవహిస్తుండటం చూసి .. అక్కడికెళ్లింది. కాసేపు నీటిలో సేదతీరింది. అసలే ఎండ ... ఆపై నీటిలో ఉన్న అంతగా పనిచేయలేదు. దీంతో అది సృహ కోల్పోయి .. పడిపోయింది. నెమలి పడిపోవడంతో స్థానికులు వెంటనే స్పందించారు.

సెలైన్ ఎక్కించిన వైద్యులు

సెలైన్ ఎక్కించిన వైద్యులు

నెమలిని నీడకు తీసుకొచ్చారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలోని అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి వాయువేగంతో చేరుకుంది. నెమలిని పరీక్షించి ప్రథమ చికిత్స అందించింది. ఉష్ణతాపానికి గురైన దానికి సెలైన్ ఎక్కించారు. వైద్యుల చికిత్సతో నెమలి కోలుకుంది. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందింది. సృహ కోల్పోయిన స్థానికలుు వెంటనే స్పందించడంతో జాతీయపక్షిని సకాలంలో రక్షించగలిగారు. అసలే పశు, పక్షులు అంతరించిపోతున్న క్రమంలో .. నెమలికి సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాలు కాపాడగలిగారు. స్థానికులు చూపిన చొరవ, సకాలంలో స్పందించిన వైద్యుల సేవలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

English summary
peacock got out of the janagama district suburb. Meanwhile the water flows at a bore. It was cold in the water for a while. Suddenly sunny ... and then there was not much work in the water. It was lost and lost. When the peacock fell, the locals immediately responded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X