మాజీ జస్టిస్ చంద్రు హాట్ కామెంట్స్.. కేసీఆర్ తీరు విస్మయం కలిగించింది..
మాజీ జస్టిస్ చంద్రు.. జై భీమ్ మూవీతో అందరికీ తెలిసిపోయారు. ఆయన పోరాటం, న్యాయం కోసం పడిన తపన కనపడింది. అయితే ఇటీవల ఏపీ హైకోర్టు గురించి కామెంట్స్ చేయడంతో దుమారం చెలరేగింది. వెంటనే జస్టిస్ బట్టు దేవానంద్ కూడా తప్పుపట్టారు. ఇలా ఉండగా ఇవాళ సీఎం కేసీఆర్ గురించి చంద్రు కామెంట్స్ చేశారు. ఒక విషయంలో ఆయన తీరు నచ్చలేదని నిర్మోహమాటంగా చంద్రు కామెంట్ చేశారు.

కేసీఆర్ తీరు సరిలేదు..
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై జస్టిస్ చంద్రు కీలక వ్యాఖ్యలు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మాట్లాడారు. ప్రజావ్యతిరేకంగా మాట్లాడితే ఎవరూ ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరని కేసీఆర్‌ని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ తీరు విస్మయం కలిగించిందన్నారు. సమ్మె ఎన్నిరోజులు చేస్తారో చూస్తానని కేసీఆర్ బెదిరించారని చెప్పారు. యూనియన్లతో కాకుండా ఉద్యోగులతోనే మాట్లాడతాననడం ఏంటి? అని ప్రశ్నించారు. కచ్చితంగా యూనియన్లతో మాట్లాడాల్సి ఉంటుందని సూచించారు.

అధికారంలో ఉండరు..
ప్రజలకు వ్యతిరేకంగా వెళ్తే కేసీఆర్ ఎన్నో రోజులు అధికారంలో ఉండలేరని చెప్పారు. జై భీమ్ సినిమా ఒక కొత్త గుర్తింపు కార్డు తీసుకొచ్చిందని, ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ఆహ్వానాలు వస్తున్నాయని జస్టిస్ చంద్రు తెలిపారు. కేసీఆర్‌పై చేసిన కామెంట్స్ మాత్రం చర్చకు దారితీశాయి.

ఇదీ సరికాదు
అంతకుముందు న్యాయవ్యవస్థను ఉద్దేశించి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హై కోర్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని.. ఎందరివో ప్రాథమిక హక్కులున కాపాడుతున్నామని జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. కొన్ని కారణాలతో మొత్తం హై కోర్టును ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. విశాఖలో ఓ డాక్టర్ ను పోలీసులు రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు. హక్కుల గురించి పోరడాలంటే విశాఖకు వెళ్ళండి. మంచి డైరెక్టర్ తో సినిమా తీయించాలని అసహనం వ్యక్తం చేశారు. దేశంలో ఇతర హైకోర్టులతో పోలిస్తే, జడ్జి నుంచి కక్షిదారుల వరకూ ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేవని.. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications