మంత్రి ఈటలపై తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్.. అన్యాయం అని ఫైర్

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌పై తీర్మాన్ మల్లన్న (నవీన్) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలను రాజకీయంగా కలవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్‌లో అన్యాయం జరుగుతోన్న మాట వాస్తవమన్నారు. దీనికి సంబంధించి గతంలోనే ఖండించానని మల్లన్న గుర్తుచేశారు. బీజేపీ నేత బండి సంజయ్ తనకు లక్ష ఓట్లు వేయిస్తే మరి బీజేపీ అభ్యర్థికి ఎందుకు ఆయన ఓట్లు వేయించలేకపోయాడని ప్రశ్నించారు.

బండి సంజయ్, తాను ఒకే కులమైతే ఏంటి అని అడిగారు. తమ సిద్ధాంతాలు వేరు అని తెలిపారు. కులానికి చెందిన వ్యక్తిని కాదని.. దయచేసి కుల ముద్ర వేయొద్దని సూచించారు. కాంగ్రెస్ నేత రేవంత్, వైఎస్ షర్మిల డబ్బులు నాకెందుకు అని అడిగారు. ప్రజలే ఓట్లు, నోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. తన అనుచరులు ఒక్క రోజు టీ తాగకుంటే 5 కోట్లు జమ అవుతాయని చెప్పారు.

బీజేపీ సహా ఏ పార్టీలోను చేరే ప్రసస్తే ఉండదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని సాగర్ ఓటర్లకు పిలుపునిస్తున్నాని మల్లన్న పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌పై ద్వేషం లేదని చెప్పారు. ఆయన తీసుకునే నిర్ణయాలనే వ్యతిరేకిస్తున్నాని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 6 వేల కిలోమీటర్ల పాదయాత్రకు ప్రణాళిక సిద్ధమైందని చెప్పారు.

teenmar mallanna hot comments on minister etela rajender

ఢిల్లీలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రచారం ఒట్టిదేనని చెప్పారు. అసెంబ్లీ అంటే తెలియని వారిని తనతోపాటు అసెంబ్లీ గడప తొక్కిస్తానని తిన్మార్ మల్లన్న ప్రకటించారు. ఇదీ సత్యం అని మల్లన్న తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+