హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌తో తేజస్వి భేటీ.. ఫోన్‌లో మాట్లాడిన లాలు.. కలిసి పనిచేద్దాం అంటూ

|
Google Oneindia TeluguNews

బీజేపీ, కాంగ్రెసేయతర కూటమిపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. అప్పట్లో ఫెడరల్ ఫ్రంట్ అని ఇతర పార్టీ నేతలు/ సీఎంలతో వరసగా సమావేశం అయ్యారు. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోవడంతో సద్దుమణగింది. ఇప్పుడు ఎన్నికలు జరిగే ఛాన్స్ లేదు.. కానీ కేసీఆర్ మాత్రం వేగంగా పావులు కదుపుతున్నారు. ఇటీవల వామపక్ష నేతలతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. అంతకుముందు తమిళనాడు పర్యటనలో సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. అయితే ఇవాళ బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.

బీజేపీని గద్దె దింపాల్సిందే..?

దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం విధానాలు సహా పలు కీలక అంశాలపై ఇద్దరు చర్చించారు. తేజస్వి యాదవ్‌తోపాటు మాజీ మంత్రి అబ్దుల్ బారి సిద్దిఖీ, మాజీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ పాలసీ, విద్యుత్ సవరణ చట్టం, రైతు వ్యతిరేక విధానాలపై తేజస్వి యాదవ్.. సీఎం కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.
బీజేపీ అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన తక్షణ అవసరం ఉందనే అభిప్రాయం కేసీఆర్, తేజస్వి యాదవ్ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా రైతులు సహా సమస్త వర్గాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న బీజేపీని గద్దె దించే వరకు పోరాడాల్సిన అవసరం ఉందని తేజస్వి యాదవ్ అన్నారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో నిర్ణయించుకోవాలని ఇరువురూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

లాలుతో ఫోన్‌‌లో సంభాషణ

లాలుతో ఫోన్‌‌లో సంభాషణ

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్జెడీ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చిన విషయాన్ని లాలూ గుర్తు చేసినట్టు సమాచారం. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు ముందుకు రావాలంటూ సీఎం కేసీఆర్ ను లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. తెలంగాణ కోసం ఎంతో పోరాడారు. త్యాగం చేశారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. నేడు దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారు. అన్ని మతాలను కులాలను వర్గాలను సమానంగా చూస్తూ సాగుతున్న మీ పాలనానుభవం దేశానికి అవసరం ఉంది. జాతీయ రాజకీయాల్లో మీరు తగిన పాత్ర పోషించాలి. లౌకిక ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఆరాచక పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకు లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాలి. దేశాన్ని నాశనం కానివ్వద్దు. అందుకు మీరు ముందుకు రావాలని లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం కేసీఆర్‌ను కోరినట్టు సమాచారం.

Recommended Video

BJP Ruling States Cant Implement Rythu Bandhu Like Telangana - KTR | Oneindia Telugu

అభివృద్ది గురించి చర్చ

రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ గురించి, సాగునీటి రంగాభివృద్ధి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై తేజస్వి యాదవ్ సీఎం కేసీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. దేశ సమగ్రతను కాపాడే దిశగా జాతీయ రాజకీయాలను బలోపేతం చేయాలని, అందుకోసం సాగే బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి సాగుతామని ఆర్జెడీ నేతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై వీరు ఇరువరూ చర్చించారు. యూపీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్‌కే తమ మద్దతిస్తున్నట్టు సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ ప్రకటించడం గొప్ప పరిణామమని వారు చర్చించినట్టు సమాచారం.

English summary
rjd leader tejasvi yadav meets cm kcr at pragathi bhavan. they discuss various issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X