హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరి కోసం ఈ అసెంబ్లీ సమావేశాలు: టీఆర్ఎస్‌పై రాజా సింగ్, కీలక బిల్లులకు సవరణలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. అంతేగాక, తాను అందుబాటులో లేనందున అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తాను రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నానని తెలిపారు.

మీ మీద మీకే నమ్మకం లేదా? అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయండి

మీ మీద మీకే నమ్మకం లేదా? అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయండి


ఇంత హఠాత్తుగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని రాజా సింగ్ ప్రశ్నించారు. గతంలో మున్సిపల్ చట్టంలో టీఆర్ఎస్ సర్కారే సవరణలు చేసిందని.. ఇప్పుడు మళ్లీ చేస్తా అంటున్నారని మండిపడ్డారు. మీ మీద మీకే నమ్మకం లేదా? అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎంఐఎంకు లాభం చేకూర్చేందుకే ఈ సవరణ అని తెలిసిందని రాజా సింగ్ ఆరోపించారు. బీజేపీకి ఉన్న సభ్యుడిని తానొక్కడినేనని, కాబట్టి అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు

అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు

ఇది ఇలావుండగా, అక్టోబర్ 13,14 తేదీల్లో నిర్వహించే శాసనసభ, మండలి సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లున రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు పరిశీలించారు. సభలో సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండే విధంగా అమర్చిన సీటింగ్ విధానం కొనసాగించాలని, సభల ప్రాంగణం, సభ లోపల పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయించాలని అధికారులను ఆదేశించారు.

అసెంబ్లీ సమావేశాల్లో కీలక సవరణలు

అసెంబ్లీ సమావేశాల్లో కీలక సవరణలు


కాగా, మంగళవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు సవరణలు చేయనున్నారు.
వాటిలో ఒకటి
నాలా చట్టానికి సవరణ
వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చే క్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు ఇటీవలి నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు సూచించింది. ధరణి పోర్టల్ ద్వారా సంబంధిత వివరాలను అందచేస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తు, భూమార్పిడి సులభతరం చేస్తూ చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
రెండోది రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణలు చేస్తు బిల్లు,
మూడోది జీహెచ్ఎంసీ చట్టం-1955 సవరణ:
జీహెచ్ఎంసీ పాలక మండలిలో మహిళలకు 50శాతం ప్రాతినిథ్యానికి చట్టబద్దత కల్పిస్తూ, వార్డు కమిటీల పని విధానానికి సంబంధించి, వార్డుల రిజర్వేషన్‌కు సంబంధించిన అంశంలో చట్ట సవరణలు.
ఇక నాలుగోది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో సవరణలు:
నిందితుడు కోర్టుకి సక్రమంగా హాజరుకాకపోతే ష్యూరిటీలకు జరిమానా వేసే విధంగా చట్ట సవరణ.

English summary
telangana assembly sessions: Raja Sing questions trs govt on bills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X