హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

8వ తేదీన క్యాబినెట్ భేటీ.. లాక్‌డౌన్, థర్డ్ వేవ్ సహా చర్చించే కీలక అంశాలు ఇవే..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం (జూన్ 8వ తేదీన) జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో వైద్యం, కరోనా పరిస్థితులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్‌డౌన్ గురించి చర్చిస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా కేబినెట్ చర్చించే అవకాశముంది.

 ఇవే అంశాలు

ఇవే అంశాలు

రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి.. ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర అంశాల మీద సమీక్ష జరగనుంది. వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో.. పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయంపై, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.

 కరోనా తగ్గుముఖం

కరోనా తగ్గుముఖం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల కారణంగకరోనా రెండో వేవ్ తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. థర్డ్ వేవ్ రానుందనే వార్తల నేపథ్యంలో దాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత, తగు ఏర్పాట్లపై కేబినెట్ కీలకంగా చర్చించనుంది. కరోనా కట్టడికోసం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో, దాని పర్యవసానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమయ్యిందనే అనే అంశాల మీద కేబినెట్ చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

 డయాగ్నస్టిక్ సెంటర్లు

డయాగ్నస్టిక్ సెంటర్లు

ఈ నెల 7 నుంచి 19 జిల్లాల్లో 19 డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించే కార్యక్రమాన్ని జూన్ 9వ తేదీకి వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కార్యక్రమంలో మంత్రులు పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయంపై కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

లాక్‌డౌన్ పొడగింపు..?

లాక్‌డౌన్ పొడగింపు..?

లాక్ డౌన్ జూన్ 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఆ తర్వాత పొడగింపు/ ఎత్తివేయడంపై డిస్కష్ చేస్తారు. వాస్తవానికి మార్కెట్ తగ్గుముఖం పట్టడంతో తీసివేస్తారని తెలుస్తోంది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడగిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ థర్డ్ వేవ్ ఇంపాక్ట్ వల్ల నిబంధనలు మరింత కఠినతరం చేసే ఛాన్స్ ఉంది.

English summary
telangana cabinet meeting held on june 8th tuesday. lockdown, irrigation projects another issues to be discussed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X