హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ క్యాబినెట్‌లో భారీ మార్పు చేర్పులు..? ఇదీ కేసీఆర్ లెక్క

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో మంత్రివర్గ మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇందుకు గల కారణాలు కూడా ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌ను ఎమ్మెల్సీ చేయడంతో కేబినెట్‌లో మార్పులు చేర్పులపై చర్చ మొదలైంది. కేబినెట్‌లో చోటు కల్పించడానికే ఆయనను మండలికి తీసుకొచ్చారని సమాచారం. బండ ప్రకాశ్‌తోపాటు మరికొందరిని కేబినెట్‌లోకి తీసుకోవడం.. ఇంకొందరిని డ్రాప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

రాజయ్య.. కడియం

రాజయ్య.. కడియం

తొలి కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను బర్తరఫ్‌ చేసి ఆ స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంను కేసీఆర్ చేశారు. రెండోసారి కడియం శ్రీహరిని కేబినెట్‌లోకి తీసుకోకుండా మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్సీని చేశారు. ఎవరూ ఉహించని విధంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్‌ చేసిన కేసీఆర్‌ అదే సామాజికవర్గానికి చెందిన బండ ప్రకాశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లేకపోతే ఉన్నపళంగా ఆయనను రాజ్యసభ నుంచి శాసనమండలికి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ముదిరాజ్ సామాజికవర్గంలో బండ ప్రకాశ్‌కు మంచి పేరుండటంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతుంది.

ఇప్పుడే కాదు

ఇప్పుడే కాదు

ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. ప్రకాశ్‌తోపాటు మరికొందరిని కేబినెట్‌లోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా బెర్త్‌ సంపాదించారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు నిర్ణయం తీసుకుంటే గుత్తాను పిలుస్తారని చర్చ జరుగుతోంది. గుత్తాను తీసుకుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఉన్న మరో మంత్రిని డ్రాప్‌ చేస్తారా లేక.. అదే సామాజివర్గం నుంచి వేరే జిల్లాలో మరొకరిని తీసేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

వెంకట్రామిరెడ్డికి ఛాన్స్

వెంకట్రామిరెడ్డికి ఛాన్స్

కొత్తగా ఎమ్మెల్సీ అయిన మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డిని కూడా కేబినెట్‌లోకి తీసుకుంటారనే అంచనాలు ఉన్నాయి. సీఎంతో సన్నిహితంగా ఉన్న ఆయనకు ఛాన్స్‌ ఇస్తే కేబినెట్‌లో ఒక బెర్త్‌ ఖాళీ చేయాలి. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్లారెడ్డిని కేబినెట్ నుంచి డ్రాప్‌ చేయొచ్చనే ఉహాగానాలు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను నడిపించలేకపోతున్నారనే విమర్శ ఆయనపై ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి గెలిచి కేబినెట్‌లో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు పట్నం మహేందర్‌రెడ్డి.

Recommended Video

Telangana: Temperature Dips, Rapidly Falling in TS
పల్లాకు ఛాన్స్..?

పల్లాకు ఛాన్స్..?

సామాజిక సమీకరణలతో చివరలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఇటీవల గ్రాడ్యుయేట్ స్థానం నుంచి మరోసారి ఎమ్మెల్సీగా గెలిచారు. కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటే తనకు అవకాశం వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పల్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేబినెట్‌లోకి తీసుకోవాలి అనుకుంటే ఈ మూడు జిల్లాల్లో ఏదో ఒక జిల్లా నుంచి పల్లా ఎంట్రీకి ఛాన్స్ ఉంది. రెండోసారి కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న వాళ్లలో ఒకరిద్దరిని డ్రాప్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వాళ్లు రెండోసారి కేబినెట్లో ఉన్నారు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలనుకుంటే సంచలనాలు తప్పదని పార్టీ వర్గాల సమాచారం.

English summary
telangana cabinet will be expansion in soon. who is in and who is out list is here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X