హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెలన్నర తర్వాత రాజ్‌భవన్‌కు కేసీఆర్.. మోదీ ఫోన్ తర్వాతిరోజే గవర్నర్‌తో భేటీ..

|
Google Oneindia TeluguNews

కరోనా కట్టడి, చికిత్సలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిలైందంటూ అటు హైకోర్టు, ఇటు ప్రతిపక్ష పార్టీలు ఆక్షేపించడం.. కొన్నాళ్లపాటు ముఖ్యమంత్రి ఎవరికీ కనిపించకపోవడం.. అదే సమయంలో గవర్నర్ యాక్టివ్ గా మారి కరోనా సమీక్షలు నిర్వహించడం.. రాష్ట్రంలో గవర్నర్ పాలన, హైదరాబాద్ లో సెక్షన్ 8 విధింపునకు డిమాండ్ వెల్లువెత్తడం.. తదితర పరిణామాల నేపథ్యంలో నెలన్నర రోజుల తర్వాత సీఎం కేసీఆర్.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ కావడం గమనార్హం.

కొత్త కేసులు భారీగా నమోదవుతోన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉండటంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి సడెన్ గా ఫోన్ చేసి సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. కట్టడి చర్యలపై ఆరా తీశారు. మోదీ ఫోన్ కాల్ తర్వాతిరోజే కేసీఆర్ రాజ్ భవన్ బాట పట్టడంప్రాధాన్యతను సంతరించుకుంది. చివరిసారిగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న గవర్నర్ ను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వివిధ పరిణామాల తర్వాత ఇన్నాళ్లకు భేటీ కావడంతో వివిధ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా..

సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ ఆదేశం - రేవంత్ రెడ్డి పిటిషన్‌పై భిన్న స్పందన..సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ ఆదేశం - రేవంత్ రెడ్డి పిటిషన్‌పై భిన్న స్పందన..

Telangana: CM KCR meets governor Tamilisai, discussed various issues

సచివాలయం కూల్చివేత పనులు, కొత్త భవంతుల నిర్మాణానికి సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్.. గవర్నర్ కు వివరించారని, కరోనా కట్టడి చర్యలపై గవర్నర్ ఆరా తీయగా, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను కూడా సీఎం నివేదించారని వెల్లడైంది. అలాగే, గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీపైనా సీఎం చర్చించారని తెలిసింది. రాజ్ భవన్ నుంచి తిరిగి ప్రగతి భవన్ చేరుకున్న కేసీఆర్.. ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Telangana: CM KCR meets governor Tamilisai, discussed various issues

Recommended Video

Tollywood Director Wise Words On Covid 19 | Oneindia Telugu

తెలంగాణలో కరోనా పరిస్థితులపై సోమవారం జరిగిన విచారణలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పొరుగురాష్ట్రమైన ఏపీలో టెస్టులు విరివిగా చేస్తుండగా, ఇక్కడ మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రజలను గాలికొదిలేశారని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలేదని చీఫ్ జస్టిస్ ధర్మాసం ఘాటు వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో ఇప్పటిదాకా 2.65లక్షల టెస్టులు చేయగా, 45వేలపైచిలుకు కేసులు వచ్చాయి. అందులో 32,438 మంది ఇప్పటికే డిశ్చార్జికాగా, 12,224 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao called on Governor Tamilisai Soundararajan at Raj Bhavan here on Monday. CM informed Governor of the progress in the demolition of old Secretariat buildings, the state government's measures to contain the spread of Coronavirus. Rao also discussed over two vacant MLC seats under governor's quota.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X