హస్తినలోనే తేల్చుకుంటాం.. సీనియర్ల గుర్రు, రేవంత్ వైఖరిపై అసహనం
కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు.. వర్గ పోరు.. జాతీయ పార్టీలో ఇవన్నీ సహజమే.. కానీ ఆ పార్టీ క్రమంగా జనం విశ్వాసం కోల్పోతుంది. తిరిగి పుంజుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. అయితే తెలంగాణలో కూడా ఆ పార్టీకి పూర్వ వైభవం దక్కడం లేదు. అందుకోసమే.. రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. అయినా వ్యతిరేక వర్గం పావులు కదుపుతుంది. మెల్లగా హై కమాండ్ వద్దకు బయల్దేరింది.

సీనియర్ల భేటీ..
కాంగ్రెస్ సీనియర్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటిపై చర్చించారు. త్వరలో ఢిల్లీ వెళ్లాలని డిసైడయ్యారు. పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని.. సీనియర్లనే గౌరవం లేకుండా కొత్త నాయకత్వం ప్రవర్తిస్తోందని గుర్రుగా ఉన్నారు. తమతో చర్చించకుండానే కొత్త కార్యక్రమాల ప్రకటన.. సీనియర్ల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, నిరంజన్, కోదండరెడ్డి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

ఒంటెద్దు పోకడలు
మూడు గంటల పాటు చర్చించిన సీనియర్లు రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎక్కువగా చర్చ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ తన ఒంటెద్దు పోకడలతో వన్‌మెన్ షో చేస్తున్నారని సీనియర్లు మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పార్టీ పూర్తిగా ఒక్కరి చేతుల్లో బందీ అవుతుందనే అంశం చర్చకు వచ్చింది. అలాగే సీనియర్లను కావాలనే పక్కన పెట్టే విధంగా అవమానకరంగా.. కొత్త పీసీసీ ప్రవర్తిస్తున్నారని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు.

అవమానం..
తనకు మంచిర్యాలలో జరిగిన అవమానం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య.. తన నియోజకవర్గంలో జంగా రాఘవరెడ్డి పెత్తనం ఎక్కువైందని.. తనకు సమాచారం లేకుండా కార్యక్రమాలు జరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వాల విషయంలో సీనియర్లను అవమాన పరిచేలా పీసీసీ కామెంట్స్ చేశారని మర్రి శశిధర్‌రెడ్డి కామెంట్స్ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు సైతం సీనియర్లకు మద్దతు తెలిపారు.
Recommended Video

ఏకపక్షంగా..
పీసీసీ చీఫ్ రేవంత్ ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో గుత్తాధిపత్యం పెరిగిపోతోందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లాపూర్ సభలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే డిమాండ్‌ను వ్యక్తం చేస్తూ.. తీర్మానాలు వ్యక్తం చేస్తూ కొత్త సాంప్రదాయానికి తెరలేపారని.. త్వరలో ఈ డిమాండ్‌పై అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని సీనియర్ల భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇలాంటి పోకడలను నిలువరించేందుకు త్వరలో ఢిల్లీ వెళ్లి... అధిష్టానంతో భేటీ కావాలని సీనియర్లు నిర్ణయించారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications