హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నామినెటెడ్ పోస్టుల భర్తీ, క్రిశాంక్, ఎర్రొళ్ల శ్రీను, వేద సాయికి పదవీ.. ఉత్తర్వులు జారీ

|
Google Oneindia TeluguNews

నామినేటెడ్ పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసింది. మూడు పోస్టులను ఇవాళ ఫిలప్ చేసింది. టీఆర్ఎస్ పార్టీకి సేవలు అందిస్తోన్న ముగ్గురికి పదవులను కట్టబెట్టింది. కార్పొరేషన్ల చైర్మన్ల నియమకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మన్నె క్రిశాంక్‌, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌గా డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా వేద సాయిచందర్‌ నియమితులు అయ్యారు. ఈ పదవుల్లో వీరు రెండేళ్ల పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పదవులు..

పదవులు..

మన్నె క్రిశాంక్.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. టీఆర్ఎస్ పార్టీ ఐటీ వింగ్ విభాగంలో పనిచేశారు. తనకు అప్పగించిన పనిని.. అంతే శ్రద్దతో నిర్వహించారు. మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ దృష్టిలో పడ్డారు. ఇటు ఎర్రోళ్ల శ్రీనివాస్ అయితే విద్యార్థి దశ నుంచే టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేశారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. ఇదివరకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. సీఎం కేసీఆర్ మరోసారి నామినెటెడ్ పదవీ ఇచ్చారు.

జీత భత్యం..

జీత భత్యం..


వేద సాయిచందర్ కూడా టీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించారు. అందుకుగానూ నామినెటెడ్ పదవీని అప్పగించారు. తమిళనాడు పర్యటన ముగిసిన తర్వాత నామినెటెడ్ పదవులపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వీరు రెండేళ్ల పాటు పదవీలో కొనసాగుతారు. వీరికి జీత భత్యం, ఇతర వసతులు, సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందుతాయి.

 కేసీఆర్ బిజీ బిజీ

కేసీఆర్ బిజీ బిజీ

ఇటు 17వ తేదీ సీఎం కేసీఆర్ బిజీ అవుతారు. సమీక్షలు.. జిల్లాల బాట పట్టబోతున్నారు. 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ, మండలి సభ్యులు, జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, కేడీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం నిర్వహిస్తారు.

English summary
telangana government appoints three corporation chairmans.manne krishank, errolla srinivas, veda sai chander get corporation posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X