Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీఆర్ఎస్ ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు: ఆ జీవోను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎంపీ, హెటిరో ఛైర్మన్ పార్థసారథి రెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ ఫౌండేషన్ కు ట్రస్టీగా పార్థసారథి రెడ్డి ఉండటం గమనార్హం. 2018లో హైదరాబాద్‌లోని ఖానామెట్ వద్ద క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం 15 ఎకరాల భూమిని ఆ ఫౌండేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

ఇందుకు సంబంధించిన జీవోను సవాల్ చేస్తూ 2019లో హైకోర్టులో కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రైట్ సొసైటీతోపాటు ఊర్మిల, సురేష్ కుమార్ ఈ పిల్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్.. భూ కేటాయింపును రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.

Telangana high court dismissed govt GO on land allocation for sai sindhu foundation

భూ కేటాయింపుపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. భూ కేటాయింపుల విధానానికి అనుగుణంగా దీనిపై పున:పరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలంటూ పిటిషన్లు:తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని మొత్తం ఐదు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. పేపర్ లీక్ కారణంగా గతంలో నిర్వహించిన టీఎస్ పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు పేపర్ లీక్ కు కారణమైన వారితోనే మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, దాఖలైన అన్ని పిటిషన్లు ఈ మధ్యాహ్నం వింటామని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది.

మరోవైపు, జూన్ 11న గ్రూప్ 1 పరీక్షకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థుల వివరాల ర్యాండమైజేషన్ తర్వాత వీటిని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆదివారం అంటే జూన్ 4 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.

జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల పరీక్ష జరగనుంది. అక్టోబర్ 16 నాటి పరీక్ష కోసం డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లు ఇప్పుడు పనిచేయవని.. తాజాగా మళ్లీ తీసుకోవాలని కమిషన్ సూచించింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై వారం రోజులుగా టీఎస్‌పీఎస్సీ బోర్డ్ సమాలోచనలు చేసి.. ఈ నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసుల ఉద్యోగాలకు గత ఏడాది ఏప్రిల్‌లో కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. గత అక్టోబర్ 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షను ప్నశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 11న నిర్వహించనున్న రెండున్నర నెలల క్రితం ప్రకటించింది. పరీక్ష మరింత పారదర్శకత పెంచేందుకు ఇప్పటికే కమిషన్ పలు చర్యలు తీసుకుంది. పోలీసు కంప్యూటర్ సెల్, ఇతర సైబర్ నిపుణులు, వర్సిటీల ప్రొఫెసర్లతో కూడిన కమిటీలు చేసిన సిఫార్సుల మేరకు కమిషన్‌లోని సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను పటిష్టం చేసింది. మరిన్ని ఫైర్‌వాల్స్ ఉపయోగించింది.

యూపీఎస్సీ సిఫార్సుల మేరకు పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టును సృష్టించింది. పరీక్షల విభాగం అంతా ఆ అధికారి నేతృత్వంలో నడుస్తుంది. యూపీఎస్సీ సిఫార్సుల మేరకు రాష్ట్రేతర స్థానికత కలిగిన ఐఏఎస్ అధికారి నియామకం చేప్టటింది. ఇక ప్రిలిమినరీ పరీక్షలో పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్ పీఎస్సీ అభ్యర్థులను రెండంచెల్లో తనిఖీ చేయనుంది. మెటల్ డిటెక్టర్లు, ఇతర పద్ధతుల్లో అభ్యర్థుల్ని రెండుసార్లు, రెండు బృందాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది.

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+