హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుల తెలంగాణా .. ఈ బడ్జెట్ కంటే అప్పే ఎక్కువ, ఒక్కొకరి మీద ఉన్న అప్పు చూస్తే షాక్ అవ్వాల్సిందే !!

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో కంటే అప్పుల్లో పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది . అంచనాలకు మించి అప్పులు చేస్తూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇటు తెలంగాణ రాష్ట్రం ప్రజలపై పెనుభారం మోపుతున్నాయి . ఏపీలో ప్రభుత్వం ఖర్చు చేస్తున్న వంద రూపాయలలో 45 రూపాయలు అప్పు అని కాగ్ ఇటీవల లెక్కలు విడుదల చేయగా, ప్రజల కోసం అప్పులు చేస్తున్నామని ఆ రాష్ట్ర మంత్రి సెలవిచ్చారు. ఇక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా వేరు పడిన తెలంగాణా రాష్ట్రంలోనూ అప్పుల చిట్టా పెరగటం ఆందోళన కలిగిస్తుంది .

తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం .. పట్టభద్రుల చైతన్యం ఎవరికి పట్టం కడుతుందో !!తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం .. పట్టభద్రుల చైతన్యం ఎవరికి పట్టం కడుతుందో !!

ప్రభుత్వం తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్ ని మించిపోయాయి

ప్రభుత్వం తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్ ని మించిపోయాయి

తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి పై ఇప్పటివరకు ఉన్న అప్పు ఒకింత షాక్ కు గురి చేస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పద్దు రోజురోజుకు పెరిగిపోతోంది. ద్రవ్య నియంత్రణ నిర్వహణ చట్టం పరిమితులకు లోబడి ప్రభుత్వం ఏటా తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్ ను మించిపోయాయి అంటే ఎంతగా అప్పులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది 2.30 లక్షల కోట్ల బడ్జెట్ కాగా, మొత్తం అప్పులు 2.86 లక్షల కోట్లుగా ఉన్నాయి.

బహిరంగ మార్కెట్ నుండి ఎక్కువగా అప్పులు సేకరిస్తున్న తెలంగాణా సర్కార్

బహిరంగ మార్కెట్ నుండి ఎక్కువగా అప్పులు సేకరిస్తున్న తెలంగాణా సర్కార్

ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో నలభై ఒక్క వేల కోట్లు అప్పు పెరగనున్నట్లుగా తాజా ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 2.44 లక్షల కోట్లను బహిరంగ మార్కెట్లో సేకరించింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుండి 7852 కోట్ల రూపాయలు, స్వయం ప్రతిపత్తి ఉన్న ఇతర సంస్థల నుంచి 14,860 కోట్లు, బాండ్ల రూపంలో 19,552 కోట్లు రుణాలను సమీకరణ చేసినట్లు బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రతి ఒక్క వ్యక్తి పై 81,395 రూపాయలు అప్పు

2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రతి ఒక్క వ్యక్తి పై 81,395 రూపాయలు అప్పు

ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాకు, రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యక్తి పై 81,395 రూపాయలు అప్పు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక గత ఏడాది తలసరి అప్పు 65, 480 . ప్రస్తుతం మరో 16వేలకు పైగా పెరిగి 81,395 రూపాయలు తలసరి అప్పు చేరుకుంది. రాష్ట్రాభివృద్ధికి , సంక్షేమ పథకాల అమలుకు ప్రజల కోసమే అప్పులు చేస్తున్నట్టు తెలంగాణా ప్రభుత్వం సైతం చెప్పుకోవటం కనిపిస్తుంది . ఇక ఈ ఏడాది అప్పు పెరగటానికి కరోనా కారణంగా ఇరు రాష్ట్రాలు చెప్తున్నాయి .

గత ఆరేళ్లలో తెలంగాణా సర్కార్ చేసిన అప్పు 1, 57 వేల కోట్ల రూపాయలు

గత ఆరేళ్లలో తెలంగాణా సర్కార్ చేసిన అప్పు 1, 57 వేల కోట్ల రూపాయలు


గత ఆరేళ్ల లెక్కలను బట్టి 2016 - 2017 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి 1.29 లక్షల కోట్ల అప్పు ఉంటే 2021 - 2022 ముగిసేసరికి అప్పు 2.86 లక్షల కోట్లకు చేరనుంది.

రాష్ట్రంపై అక్షరాల ఆరేళ్లలో లక్ష 57 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడింది. మొత్తానికి ఇరు రాష్ట్రాలు అప్పుల సేకరణలో పోటీ పడుతున్నట్లుగా తాజా లెక్కలతో తెలుస్తుంది.

English summary
According to the 2011 census in the state of Telangana, the debt owed so far to every person in the state is a bit of a shock.The debts of the Telangana state government are increasing day by day. Subject to the limitations of the Monetary Control Management Act, the amount of debt incurred by the government this year exceeds the one-year budget. With a budget of Rs 2.30 lakh crore this year, the total debt is Rs 2.86 lakh crore. It is estimated that there is a debt of Rs 81,395 on every single person in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X