ఇప్పుడు.. డుగు డుగు.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం..
తెలంగాణ ఆర్టీసీని నష్టాల ఉంచి బయటపడేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సరికొత్త నిర్ణయాలతో ప్రజలకు ఆర్టీసీని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. పండుగల వేళ స్పెషల్ చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులను నడిపి ఊహించినదానికంటే మూడు కోట్లు అధిక ఆదాయం ఆర్జించింది ఆర్టీసీ.

ప్రజలకు దగ్గరయ్యేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు ఆర్టీసీ అధికారులు. దసరా వేళ సుఖీభవ వీడియోతో ప్రజలను ఆకట్టుకున్న ఆర్టీసీ.. ఇప్పుడు మరో కొత్త మేమెతో వచ్చింది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన బులెట్ బండి పాటను తమను అనుకూలంగా మార్చుకొని ఓ మీమ్‌ని తయారు చేసింది. ఇది పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం నుంచి బయటపడాలంటే ఆర్టీసీ ప్రయాణమే మేలనే సంకేతం ఇస్తుంది.
ఇక ఈ మీమ్‌లో వరుడు తాను డుగ్గు.. డుగ్గు .. డుగ్గు బులెట్ బండిపై రాలేను ఎందుకంటే పెట్రోల్ రేట్ రూ.120కి చేరింది.. నేను ఆర్టీసీ బస్సులో వస్తా ఇష్టముంటే చేసుకో లేకపోతే లేదు అంటూ వరుడు వధువుకు చెబుతున్నట్లుగా ఉంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు మీ క్రియేటివిటీకి నమస్కారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆర్టీసీలో సమూల మార్పులు జరుగుతున్నాయి. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్.. ఒక్కో విభాగం మీద దృష్టిసారించారు. ఇప్పటికే ఆర్టీసీలో ఉద్యోగాల ప్రకటనకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేశారు. మరోవైపు తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించుకున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. దీని కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.
సజ్జనార్ ఆర్టీసీగా ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పలు కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు. వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీలో తన దైనశైలిలో వినూత్న చర్యలు చేపట్టారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ఆర్టీసీ లాభాల్లో పడిందని తెలిపారు.












Click it and Unblock the Notifications