4 స్థానం.. అయినా విమర్శలా కేసీఆర్.. బండి సంజయ్ నిప్పులు
తెలంగాణలో టీఆర్ఎస్- బీజేపీ మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. యాసంగిలో వరి పంట గురించి మొదలైన వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. రైతుల ఆందోళన.. ఇతర అంశాలపై ఇరు పార్టీ నేతల మధ్య వివాదం ముదిరింది. తాజాగా సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ తెలంగాణలో దీక్ష చేస్తే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా? పంజాబ్ రైతుల కోసమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ రైస్ మిల్లర్ల కోసం ఆలోచిస్తున్నాడని.. తాము రైతుల కోసం ఆలోచిస్తున్నామని సంజయ్ స్పష్టం చేశారు.

కోక కొనని వాడు..
ఢిల్లీలో చనిపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ అంటున్నారని, కన్నతల్లికి కోక కొనని వాడు.. పినతల్లికి బంగారు గాజులు పెట్టినట్టుంది కేసీఆర్ తీరు అని బండి సంజయ్ మండిపడ్డారు. దేశంలో రైతుల ఆత్మహత్యల అంశంలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని గుర్తుచేశారు. 2019లో 419 మంది రైతులు, 2020లో 471 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. వీళ్లందరికీ కేసీఆర్ రూ.20 లక్షలు ఇస్తారా? అని ప్రశ్నించారు.

సెంటిమెంట్..
ప్రతీ అంశానికి కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ జోడిస్తారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు వాస్తవం కాదా? రైతుల ఇబ్బందులు వాస్తవం కాదా? అని నిలదీశారు. ధాన్యం తడిసినా, మొలకలు వచ్చినా వెంటనే కొనాలని, బోనస్ రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని బండి సంజయ్ కామెంట్ చేశారు. మీరు చెప్పే అవాస్తవాలను జనం కూడా గమనిస్తున్నారని వివరించారు. పంట పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నది కేసీఆరేనని విమర్శించారు. నెపం కేంద్రంపై వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
Recommended Video

పంట కొనుగోలు
నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. యాసంగి పంట కొనుగోలు అంశంపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన వ్యతిరేకించారు.
రాష్ట్ర బీజేపీ నేతల గుట్టు మొత్తం బయటపడిందని కేసీఆర్ అన్నారు. ఇకనైనా బీజేపీ నేతలు తమ చిల్లర పనులు మానుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇకనైనా చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. మీ గుట్టు మొత్తం బయటపడిందని తెలిపారు. మీరేంటో అందరికీ అర్థం అయిందన్నారు. పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే.. మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరన్నారు. మీ కథేందో తెలిసిపోయింది జనాలకు. వాళ్లకు పూర్తిగా అర్థం అయిందన్నారు. తప్పుకు పొరపాటు అయింది.. క్షమించమని చెంపలేసుకొని ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలని సూచించారు. అనవసరమైన బేషజాలకు పోకుండా... వాస్తవాలు ప్రజలకు తెలపాలని సూచించారు. రైతులు కూడా బీజేపీ నేతల మాటలు పట్టుకొని ఆగం కావద్దని సూచించారు. రైతులను ఇకనైనా తప్పుదోవ పట్టించొద్దు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ కేసీఆర్ బృందం ఢిల్లీ వెళ్లింది. ఈ క్రమంలో బండి సంజయ్ స్పందించారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications