సారూ.. జర విద్యాసంస్థలు తెరవండి, సర్కార్‌కు ఓయూ, కేయూ స్టూడెంట్స్ విన్నపాలు
కరోనా కేసులు పెరుగుతున్నందున తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. మంగళవారం అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేయగా.. బుధవారం ఉదయం నుంచి ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. అయితే కరోనా పేరు చెప్పి విద్యా సంస్థలను మూసివేయడంపై రాజకీయ పార్టీలు/ విద్యార్థి నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఓయూ, కేయూ విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు.

ఓయూ విద్యార్థుల నిరసనలు
ఓయూ విద్యార్థులు శివం రోడ్డులో లేడీస్ హాస్టల్ ఎదురుగా నిరసనకు దిగారు. ఇటు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వద్ద కూడా నిరసనకు దిగారు. వరంగల్‌లో కేయూ వద్ద విద్యార్థులు ర్యాలీ తీశారు. తర్వాత వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యా సంస్థలను మూసివేయడంతో పరీక్షలు కూడా రద్దయిపోయాయి. దీంతో తమ అకాడమిక్ ఇయర్‌పై ప్రభావం చూపుతోందని తెలియజేశారు. హాస్టల్ తెరవాలని కోరితే.. తమను అదుపులోకి తీసుకున్నారని పీహెచ్‌డీ స్కాలర్ ఆర్ ెన్ శంకర్ తెలిపారు. అర్ధరాత్రి విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటని అడిగారు.

మాల్స్, ఫంక్షన్ హాల్స్ తెరవొచ్చా..?
విద్యాసంస్థలు మాత్రం నడవొద్దు కానీ.. మాల్స్, ఫంక్షన్ హాల్స్ మాత్రం తెరవొచ్చా అని నిలదీశారు. వర్సిటీలను మూసివేయడానికి ప్రభుత్వం ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందో అర్థం కావడం లేదన్నారు. దీంతో వెనకబడిన తరగతుల వారిపై ప్రభావం చూపుతుందని వివరించారు. గత సంవత్సరం ఆరుగురు పీహెచ్‌డీ స్కాలర్లు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. దీంతో వారి కుటుంబానికి క్షోభ మిగిల్చారని తెలిపారు.

ఉన్నత విద్యపై ప్రభావమా...? ఏంటీ
కరోనా వైరస్ ప్రభావం ఉంటే ఉన్నత విద్యపై ఎం ఎఫెక్టు చూపిస్తుందని మరో పీహెచ్‌డీ స్కాలర్ పద్మ అడిగారు. కరోనా ఉన్న సమయంలో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించొచ్చా అని అడిగారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్ వసతి కోసం వేలాది రూపాయలు చెల్లించామని పేర్కొన్నారు. కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కోసం ఫీజులు కూడా చెల్లించామని.. ఇప్పుడు అవీ కూడా మూయడంతో తమపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు.












Click it and Unblock the Notifications