హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆందోళన వద్దు.. గుడి, మసీదుతోపాటు చర్చి కూడా కడతాం: కొత్త సెక్రటేరియట్‌పై కేటీఆర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. దీంతో నిర్మాణం, ఇతర సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్‌కు కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఓ మాజీ టీడీపీ నేత అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఆన్సర్ ఇచ్చారు. అక్కడ ధ్వంసమైన అన్నింటినీ తిరిగి నెలకొల్పుతామని చెప్పారు.

తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లో మసీదు, చర్చి, గుడి కడతామని చెప్పారు. టీడీపీ మాజీ నాయకుడు ట్విట్టర్ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నిర్మాణ పనుల్లో భాగంగా ధ్వంసమైన గుడి నిర్మాణ పనుల గురించి వేసిన ప్రశ్నకు బదులిచ్చారు. ఒకరి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించబోమని తేల్చిచెప్పారు.

temple, mosque and church also built in new secretariat

అక్కడ గుడి కడతాం అని చెప్పారు. దీంతోపాటు మసీదు, చర్చి కూడా కడతాం అని పేర్కొన్నారు. మీరు నిశ్చింతంగా ఉండండి. ఎలాంటి ఆందోళనలకు గురికావొద్దు అని సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పారు. అందరి నమ్మకాలను సమానంగా భావిస్తామని చెప్పారు. ఇందులో సందేహాలకు తావులేదని బదులిచ్చారు. మతం పేరుతో రాజకీయాలు చేయకండి అని ట్వీట్‌కు ఆన్సర్ చేశారు.

పాత సెక్రటేరియట్ బిల్డింగులను గతేడాది పడగొడుతున్న సమయంలో రెండు మసీదులు, ఒక గుడి కొంతమేర పాడయిపోయాయి. ఆ నిర్మాణాలు పాడవడం వల్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మతనాయకులు చేసిన వినతికి స్పందించారు. నిర్మాణాలను పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరింత విశాలవంతంగా సిద్ధం చేస్తామని, పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఆ మేరకు పనులు కూడా జరుగుతున్నాయి. ఇంతలో ఒకరు ప్రశ్న వేయగా.. అందుకు కేటీఆర్ బదులిచ్చారు. గుడి, మసీదుతోపాటు.. చర్చి కూడా కడతామని తెలిపారు.

English summary
temple, mosque and church also built in new secretariat minister ktr reply to ex tdp leader question
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X