హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణానికి కసరత్తులు షురూ: టెండర్లకు ఆహ్వానం
హైదరాబాద్: ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణానికి కసరత్తులు ప్రారంభమయ్యాయి. తాజాగా, ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్(HAML).. ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. రేపట్నుంచి అంటే బుధవారం నుంచి బిడ్డింగ్ పత్రాలను జారీ చేయనున్నట్లు హెచ్ఏఎంఎల్ వెల్లడించింది. బిడ్డింగ్‌కు జులై 5 వరకు గడువు విధించింది.
మెట్రో కాంట్రాక్ట్ విలువ రూ. 5,688 కోట్లుగా నిర్ధరించింది. ఇక ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణానికి అవసరమైన ఈపీసీ టెండర్ డాక్యుమెంట్లను తయారు చేసేందుకు జనరల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా సిస్ట్రా, రైట్స్ డీబీ ఇంజినీరింగ్ సంస్థల కన్సార్టియంను ఎంపిక ఇప్పటికే ఖరారైపోయింది.

జనరల్ కన్సల్టెంట్ ఎంపిక కోసం మొత్తం 5 అంతర్జాతీయ కర్సార్టియంలు పోటీ పడగా.. వాటి సాంకేతిక సామర్థ్యం, అనుభవం పరిగణలోకి తీసుకుని కన్సార్టియం ఎంపిక చేశారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణంలో పలు విభాగాల్లో నిష్ణాతులైన 18 మంది ఇంజినీరింగ్ నిపుణులు, క్షేత్రస్థాయిలో మరో 70 మంది సీనియర్ ఇంజినీర్లు తదితర సిబ్బందిని కన్సార్టియం సమకూర్చుతుంది.
ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ వెంటనే తన పనిని ప్రారంభిస్తుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇటీవల వెల్లడించార. కాగా, మెట్రో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం ఇటీవల హైదరాబాద్ మెట్రో బృందం ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మెట్రోను ఈ బృందం పరిశీలించింది. కార్యకలాపాల గురించి కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం మెట్రో మొత్తం 23 కిలోమీటర్ల లైన్‌లో.. 16 కి.మీ భూగర్భ, 7 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌తో ఢిల్లీ విమానాశ్రయాన్ని కలుపుతూ ఎనిమిది మెట్రో రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
ఈ కారిడార్‌లో ఎయిర్ పోర్ట్ మెట్రో రైలు 19 నిమిషాల్లో గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో.. సగటున 65 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. సీనియర్ డీఎంఆర్సీ అధికారులు.. హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆయన బృందాన్ని టీ-3 ఎయిర్ పోర్ట్ టెర్నిల్‌లో ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ఉన్న భూగర్భ మెట్రో స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న లగేజీ చెకింగ్ విధానాన్ని హైదరాబాద్ మెట్రో బృందం పరిశీలించింది. కాగా, శంషాబాద్ వరకు హైదరాబాద్ మెట్రోను పొడిగిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications