Crime News: తార్నాక హత్యల కేసులో వెలుగులోకి సంచలన నిజాలు.. చంపింది ఎవరంటే..!

హైదరాబాద్ తార్నాకలోని అపార్ట్ మెంట్ లో అనుమానాస్పదంగా నలుగురు మృతి చెందిన ఘటనలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఈ హత్యలు చేసింది ఎవరో తెలుసుకుని పోలీసులే షాక్ అయ్యారు. అస్సలు ఏం జరిగిందంటే.. జనవరి 16న నగరంలోని తార్నాకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతులను తమిళనాడులోని చెన్నైకి చెందిన దంపతులు ప్రతాప్(34), సింధూర(32), కుమార్తె ఆద్య(4), ప్రతాప్ తల్లి రాజతిగా గుర్తించారు.

ప్రతాప్ శైలి

ప్రతాప్ శైలి


కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రతాప్ క్షణికావేశంలో తల్లి, భార్య, కుమార్తెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరానికి ప్రతాప్ శైలి కారణంగా తెలిసింది. అతని ప్రవర్తన తీరుతో ఈ హత్యలు జరిగినట్లు తేలింది. ప్రతాప్‌ తండ్రి చిన్నతనంలో మరణించాడు. దీంతో తల్లి కొడుకును అన్ని తానై పెంచింది.

స్నేహితులు, బంధువులకు దూరంగా

స్నేహితులు, బంధువులకు దూరంగా


ఒక్కడే కుమారుడు కావటంతో తల్లి జయతి అల్లారుముద్దుగా పెంచి పోషించింది. అతను ఏది అడిగినా ఇచ్చేది. ప్రతాప్ కావాల్సి దక్కకపోతే అలిగేవాడు. ఇలా ప్రతి విషయంలో తానే నెగ్గాలని చూసేవాడు. ఇలా అతను ఇల్లు, చదువు లోకంగా జీవించాడు. స్నేహితులు, బంధువులకు దూరంగా పెరిగాడు. బాగా చదివి చెన్నైలోని ప్రముఖ కార్ల కంపెనీలో డిజైనర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందాడు.

సింధూర

సింధూర


ఆ తర్వాత ప్రతాప్ కు సమీప బంధువైన సింధూరతో పెళ్లైంది. వారికి ఒక కూతురు జన్మించింది. అయితే ప్రతాప్ ప్రతి విషయంలో తానే నెగ్గాలని చూసేవాడు. ఇలా భార్యభర్తల మధ్య గొడవ మొదలైంది. దీంతో భార్య, కూతురు, తల్లి హైదరాబాద్ వచ్చి తార్నాకలోని ఓ ఆపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. ప్రతాప్ వారానికి ఒక సారి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపేవాడు.

కోపంతో ఊగిపోయి

కోపంతో ఊగిపోయి


ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన ప్రతాప్ అందరం చెన్నైకి వెళ్తామని చెప్పాడు. కానీ దీనికి సింధూర ఒప్పుకోలేదు. సింధూర సమాధానం కోపంతో ఊగిపోయిన ప్రతాప్ భార్య, తల్లి, కూతుర్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ప్రతాప్ తీరే కారణమని తెలుస్తోంది. అతను చిన్నప్పటి నుంచి స్నేహితులు, బంధువులు దూరంగా ఉండడం, ప్రతి దానికి ఆవేశానికి గురి కావడం కుటుంబాన్ని నాశనం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+