Hyderabad: భక్తులకు శుభవార్త.. ఆ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాట్లు..!

గణేషుడి నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ శాఖ సమన్వయంతో ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ, పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ట్యాంక్ బాండ్ వద్ద పని చేస్తున్నారు. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బాండ్ భారీగా ప్రజలు తరలొస్తారు. దీంతో హైదరాబాద్ వాటర్ బోర్డు తాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తోంది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తోంది. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిమజ్జనానికి వచ్చే వారికి ఆరోగ్య శాఖ కూడా పలు ఏర్పాట్లు చేస్తోంది.

గణేష్ నిమజ్జనం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్‎లను అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్యం అందించడానికి వైద్యలు, నర్సులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ట్యాంక్ బాండ్ భారీగా జనాలు వస్తారని.. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా వైద్య సహాయం అందించాలన్నారు.

The health department will set up health camps at places where Ganesha immersion takes place

మంత్రి సూచనతో వైద్య అధికారులు ట్యాంక్ బాండ్ వద్ద, వినాయక నిమజ్జనాలు జరిగే చోట్ల 30 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. హెల్త్ క్యాంపుల్లో వైద్యులు, నర్సులు, అంబులెన్స్, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. ఇటు పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలాపూర్ గణేషుడి శోభా యాత్ర మొత్తం సీసీ కెమెరా నిఘాలో జరగనుంది. ఈ శోభాయాత్ర 19 కిలోమీటర్ల దూరం నిర్వహించనున్నారు.

ఇటు ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం కోసం ఏర్పాట్లు జరుగుతోన్నాయి. ఇప్పటికే వినాయకుడి దర్శనం నిలివేశారు. ప్రస్తుతం వెల్డింగ్ పనులు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము వరకు పనులు పూర్తి చేయనున్నారు. ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్నానికి నిమజ్జనం పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+