Hyderabad: హైదరాబాద్‍కు ఎల్లో అలర్ట్ జారీ.. భారీ వర్షాలు కురిసే అవకాశం..
మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
హైదరాబాద్‌లో కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి సహా హైదరాబాద్‌లోని ఆరు జోన్‌లు, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీస్తాయని తెలిపింది. మే 6 వరకు కూడా వానలు పడే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల వడగళ్ల వానలు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. సోమవారం హైదరాబాద్‌లోని బండ్లగూడలో అత్యధికంగా 29.3 మి.మీ వర్షపాతం నమోదయింది.
వర్షాల కారణంగా మే 5, 2023 వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని IMD హైదరాబాద్ సూచించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 లో ఓ బాలుడు నీటి గుంతలో పడి చనిపోయాడు. వర్షంతో నీటి గుంత నిండగా.. మంగళవారం ఉదయం బాలుడు అందులో పడి మరణించాడు.












Click it and Unblock the Notifications