Hyderabad: హైదరాబాద్ లో పాముల కలకలం..
హైదరాబాద్ లో పాముల సంచారం పెరిగిపోయింది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవన సమీపంలో పాము కలకలం సృష్టించింది. ఆర్ట్స్ కాళాశాల భవనంలో వెనుక ఉన్న ఎస్ బీఐ బ్యాంకు ఆవరణలో పాము సంచరిస్తూ.. పక్కనే ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న డిపార్టమెంట్ల వైపు వెళ్లేందుకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన విద్యార్ధులు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు, స్నేక్ క్యాచర్ వచ్చిపామును పట్టుకున్నాడు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. .
ఆర్ట్స్ కళాశాల భవనంలో పాముల సంచారం సాధారణంగా మారిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నాగుపాములు నిత్యం నేలమాళిగలోకి ప్రవేశిస్తూ విద్యార్థులు, సిబ్బందికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నాయనన్నారు. తాచుపాము శుక్రవారం సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. సిగ్నల్ లైట్లు ఉన్న స్థంభం పైకి ఎక్కిన పాము ఎంతకీ దిగకపోవడంతో వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

హిమాయత్ నగర్ లోని లిబర్టీ చౌరస్తా సిగ్నల్ దగ్గర పాము హల్ చల్ చేసింది. వేప చెట్టుపై నుంచి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నల్ స్థంభం పైకి వచ్చింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు పామును తమ ఫోన్ లలో వీడియో తీసుకోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పాము దాదాపు గంట పాటు ట్రాఫిక్ , లా అండ్ ఆర్డర్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది.
ఆ తర్వాత సిగ్నల్ స్తంభం నుంచి కిందకు దిగింది. పక్కనే ఖాళీగా ఉన్న బిల్డింగ్ సెల్లార్ లోకి వెళ్లిపోయింది. ఇదంతా చాలా మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications