Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఔటర్ ను కూడా అమ్మేసుకున్నారు.!ఇద్దరు ఐఏఎస్ అధికారులు ప్రమేయం ఉంది.!రేవంత్ ఘాటు విమర్శలు.!

హైదరాబాద్ : 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని శంషాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడం జరిగిందని, హైదరాబాద్ మహా నగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్ ను కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం 6696 కోట్లు గత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిందని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ నిర్మించిందని స్పష్టం చేసారు. విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ ప్రామాణికంగా తెలంగాణకు పెట్టుబడులు పెడుతున్నారని రేవంత్ గుర్తు చేసారు.

ఔటర్ ను కాంగ్రెస్ నిర్మిస్తే కేటీఆర్ లీజుకిచ్చాడన్న రేవంత్.. : ఇదిలా ఉండగా గత 4 సంవత్సరాల నుంచి టోల్ ను ఈగల్ ఇన్ఫ్రా కు కట్టబెట్టారని, ఔటర్ రింగ్ రోడ్ ను ఆదాయ వనరుగా మంత్రి కేటీఆర్ మిత్రబృందం ఉపయోగించుకుంటుందన్నారు రేవంత్ రెడ్డి. ఈ ఆదాయాన్ని శాశ్వతంగా ఉపయోగించుకునేందుకు కేటీర్ కుటుంబం సన్నాహాలు చేస్తోందన్నారు. తమ కుటుంబానికి లాభం ఉండాలని 30 సంవత్సరాలు ప్రయివేటు సంస్థకు కట్టబెట్టాలనే నిర్ణయం తీసుకున్నారని, ఔటర్ రింగ్ రోడ్డును కేటీఆర్ ప్రయివేటు సంస్థకు తాకట్టు పెట్టారని, వేల కోట్ల ఆదాయం వచ్చే రింగ్ రోడ్ ను కమీషన్ల కోసం ప్రయివేటుకు అమ్మేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

.Revanth

ఆదాయ వనరుగా ఔటర్ రింగ్ రోడ్.. : పెట్టుబడులు అంటే నూతన ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని, కానీ ఉన్నవాటిని తాకట్టు పెట్టడం కాదన్నారు రేవంత్. కనీసం 30వేల కోట్లు ఆదాయం వచ్చే ఔటర్ 7380 కొట్లకే ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారని ఆరోపణలు గుప్పించారు. దీని వెనక సోమేశ్ కుమార్ వ్యవహారం నడిపారని, మున్సిపల్ కమీషనర్ అరవింద్ కుమార్ సంతకం పెట్టారన్నారు. ప్రభుత్వం దిగిపోయే ముందు తీసుకున్న నిర్ణయాలను వచ్చే ప్రభుత్వం ఎండగడుతుందన్నారు రేవంత్ రెడ్డి.

లీజ్ అంశంలో గోల్ మాల్ జరిగిందన్న రేవంత్..: దేశంలోనే ఇది అత్యంత పెద్ద కుంభకోణమని, ఇందులో 1000 కోట్లు చేతులు మారాయన్నారు రేవంత్ రెడ్డి. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించదని, తాము అధికారంలోకి వచ్చాక మొట్టమొదట వీటిపై విచారిస్తామన్నారు రేవంత్ రెడ్డి. లీజుకు తీసుకున్నయాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు పీససి చీఫ్. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ నిర్ణయాలన్నింటిపై కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుందని, ఈ నిర్ణయాలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.

.Revanth

నిజాలు కక్కిస్తాం.. దోషులను శిక్షిస్తామన్న రేవంత్ రెడ్డి..: ప్రజల ఆస్తులను సీఎం చంద్రశేఖర్ రావు అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై బీజేపీ కీలక నేతలు కూడా స్పందించాలని అన్నారు. ప్రజలు ఔటర్ రింగ్ రోడ్ ను వినియోగించే పరిస్థితులు లేవని, టెండర్ విధానాలపై విచారణ సంస్థలన్నింటికి పిర్యాదు చేస్తామని, వాస్తవంగా ఇంతకు ముందు దీన్ని అదానికి కట్టబెట్టాలని చూశారని, ఆరోపణల నేపథ్యంలో ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. 2018 నుంచి ఎవరికి టోల్ వసూలు బాధ్యత ఇచ్చారో హెచ్ఎండీఏ అధికారులు బయట పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి. ప్రజలకు అవసరమయ్యే ఔటర్ రింగ్ రోడ్ ను ఇప్పుడు అమ్మాల్సిన పరిస్తితులు ఎందుకు తలెత్తాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+