Cyber Crime: పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోండని లింక్ వచ్చిందా.. క్లిక్ చేస్తే అంతే సంగతి..
పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవాలని వచ్చే మేసేజ్ లకు స్పందించవద్దని పోలీసులు కోరుతున్నారు.
సైబర్ నేరగాళ్లు ఏదో రూపంలో మోసాలు చేస్తూనే ఉన్నారు. అమాయకులను టార్గెట్ చేసి దోచుకుంటున్నారు. తాజాగా పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవాలని లింక్స్ వస్తున్నాయి. ఈ లింక్ పై క్లిక్ చేస్తే అంతే అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీసులు ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు.

రూ.8.92 లక్షలు మాయం
ఇటీవల పలువురికి జాగా పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవాలని కాల్స్, మేసేజ్ లు వస్తున్నాయని తెలిపారు. ఆగాపూర్ కు చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్లు ఓ మేసేజ్ పంపారు. పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవాలని ఓ లింక్ పంపించారు. బాధితుడు ఆ లింక్ పై క్లిక్ చేయగానే అతని ఖాతాలో ఉన్న డబ్బు మాయమైంది. బాధితుడి ఖాతా నుంచి రూ.8.92 లక్షలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు.

లింక్స్
దీంతో బాధితుడు లబోతిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అందుకే ఎలాంటి ఫోన్ కాల్స్, మేసేజ్ లకు స్పందించకూడదని కోరుతున్నారు. పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోండి అని ఎవరైనా బ్యాంక్ పేరుతో కాల్స్ గాని, మెసేజ్ లింక్స్ గాని పంపితే వాటిని పట్టించుకోవద్దని సూచిస్తున్నారు. అవి సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించండని కోరుతున్నారు.
అధికారిక వెబ్ సైట్
పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవాలని ఐటీ ఎప్పటి నుంచి కోరుతుంది. ఇంతకుముందు పలు దఫాలు పాన్‌కార్డు-ఆధార్ అనుసంధానం చేయడానికి ఐటీ శాఖ అనుమతి ఇచ్చింది. మొన్నటి వరకు రూ.1000 ఫైన్‌తో వాటిని లింక్ చేయడానికి అనుమతించారు. వచ్చే మార్చి నెలాఖరులోగా ఆధార్‌తో పాన్ కార్డ్ నంబర్ అప్‌డేట్ చేయకపోతే.. 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సదరు పాన్ కార్డు ఇన్ ఆపరేటివ్ కార్డ్ గా మిగిలిపోతుందని ఐటీ శాఖ హెచ్చరించింది.పాన్ తో ఆధారి లింక్ చేసుకోవాలంటే అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చేసుకోవాలి. అంతే కానీ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే మేసేజ్ లకు స్పందించకుడాదని పోలీసులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications