Hyderabad: హైదరాబాద్ లోని 17 పబ్ లపై కేసు నమోదు..!
హైదరాబాద్ లో పాశ్చాత్య సంస్కృతి పెరుగుతోంది. ఈ క్రమంలోనే పబ్ లు పెరిగిపోతున్నాయి. పబ్ మాటనే అనేక అసాంఘిక కార్యకలాపాలు సాగుతోన్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని 17 పబ్‌లు కేసు నమోదు అయింది. శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘించినందుకు, సరైన ఎంటర్‌టైన్‌మెంట్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న వినోద సంస్థలపై సైబరాబాద్ పోలీసులు కేసులు పెట్టారు.
ఈ పబ్బుల్లో సౌండ్ సిస్టమ్‌లను అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లోని పలు పబ్‌లను అధికారులు సెప్టెంబర్ 28వ తేదీ శనివారం తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 15 పబ్‌లు లౌడ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి పోలీసులు, సౌండ్ మీటర్‌లను ఉపయోగించి, 88 డెసిబుల్స్ (dB) కంటే ఎక్కువ శబ్దం వస్తున్నట్లు తేల్చారు. మాదాపూర్‌లోని వివిధ పబ్‌లలో ఇలాంటి ఉల్లంఘనలు గుర్తించారు. సెప్టెం

ఆదివారం, ధ్వని కాలుష్య పరీక్షలు ఈ ఉల్లంఘనలను నిర్ధారించిన తర్వాత, BNS సెక్షన్లు 223, 292 పోలీసులు పబ్ లపై కేసు నమోదు చేశారు. ఆగస్టు 31నహైదరాబాద్, రంగారెడ్డిలోని 25 బార్‌లు, పబ్‌లపై ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో ఆరుగురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. మరోవైపు తెలంగాణలో డ్రగ్స్ వాడకాన్ని నిరోధించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు.
అప్పట్లో పబ్ ల్లో విరివిగా డ్రగ్ర్ వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అయినప్పటికీ ఏదో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications