Weather Report: ఈ సమ్మర్‍లో మంట తప్పదా..!
హైదరాబాద్ వాసులు ఈ సమ్మర్ లో జాగ్రత్తగా ఉండాలి. ఈసారి ఎండా కాలంలో వేడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం హైదరాబాద్ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో పొడి వాతావరణంతో పాటు ఉష్ణోగ్రత కూడా పెరుగుతుందని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని IMD-H అంచనా వేసింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో వేడి తీవ్రత పెరుగుతందని తెలిపింది.

సింగరేణి ఏరియాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల వంటి కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసినప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది.












Click it and Unblock the Notifications