అయ్యప్ప భక్తుల విషయంలో కొత్త నిర్ణయం ఏమీ లేదు ... డీజీపీ ఆఫీసు ఉత్తర్వుల మేరకే : సీపీ మహేష్ భగవత్
అయ్యప్ప మాల వేసుకునే పోలీస్ సిబ్బందికి విధులు నిర్వర్తించడానికి ప్రత్యేక అనుమతులు ఇవ్వడం కుదరదని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. అయ్యప్ప మాల వేసుకోవాలనుకునే పోలీసు సిబ్బంది రెండు నెలల పాటు సెలవుపై వెళ్లిపోవాలని సూచించిన హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ఈ నేపధ్యంలో తాజాగా ఆయన మరోమారు అయ్యప్ప దీక్ష చేసే పోలీసుల విషయంలో నెలకొన్న వివాదంపై స్పందించారు.
అయ్యప్ప దీక్ష చేపట్టే పోలీసులు శెలవు మీద వెళ్ళాలని ప్రత్యేక అనుమతులు కుదరవని పోలీస్ శాఖలో అంతర్గతంగా సర్క్యులర్ జారీ అయింది. అయితే, దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్లు సైతం పెదవి విరిచారు. ముస్లింలకు రంజాన్ సమయంలో ఎలా సడలింపు ఇస్తారో, హిందువులకు కూడా అలాగే ఇవ్వాలని ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. రంజాన్ సమయంలో టోపీలు, గడ్డాలు తీసేయాలని ముస్లింలకు మీరు మెమోలు జారీ చేయగలరా? అని పోలీస్ కమీషనర్ ను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశ్నించారు. అయ్యప్పమాల వేసుకున్న వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన మహేశ్ భగవత్ రాచకొండ పోలీసులపై జరుగుతున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దని తెలిపారు. పోలీసులు విధులు నిర్వహించే క్రమంలో సర్వీస్ నిబంధనల మేరకు వ్యవహరించాలని డీజీపీ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు వచ్చాయని, ఆ ఉత్తర్వులనే తాము అమలు చేస్తున్నామని తెలిపారు మహేష్ భగవత్ . అయ్యప్ప భక్తుల విషయంలో కొత్తగా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇక తమకు అన్ని మతాలూ సమానమే అని ఆయన పేర్కొన్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications