హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

hydలో ఈ ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు.. జాగ్రత్తగా ఉండాలని నిపుణుల సూచన

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. కేసులున్నీ దాదాపు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఒక్కటి మాత్రమే హన్మకొండలో వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో ఏ ప్రాంతంలో కేసులు ఉన్నాయి. ఆ వైపు వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టోలిచౌకి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇక్కడే తొలుత కేసులు వచ్చిన సంగతి తెలిసిందే.

టోలిచౌకితోపాటు యూసు్‌ఫగూడ, చార్మినార్‌ ప్రాంతాల్లో కేసులు వచ్చాయి. వీరిలో అయిదుగురు విదేశీయులు కాగా, ఒకరు మాత్రమే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా అధికారులు నిర్ధారించారు. ఒమైక్రాన్‌ పాజిటివ్‌ తొలి కేసులో బాధితుడు తన తండ్రి ఆరోగ్యం కోసం నగరానికి వచ్చాడు. అతను, మరో యువతి ఇక్కడే ఉన్నారు. మూడు రోజుల తర్వాత వారికి ఒమిక్రాన్‌ ఉన్నట్లు తేలడంతో ఆస్పత్రికి తరలించారు. అందులో ఓ వ్యక్తి పలు చోట్ల తిరిగాడు. ఇప్పుడు చార్మినార్‌, యూసుఫ్‌గూడ ప్రాంతాలలో కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఎవరూ వారు..

ఎవరూ వారు..

దీంతో అధికారులు బాధితుల సన్నిహితులను, వారు కలిసిన వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు. కొంత మంది పరీక్షలు చేయించుకోవడానికి ఆసక్తి చూపకపోవడం అధికారులకు ఇబ్బందిగా మారింది. పోలీసుల సహకారంతో నమునాలు సేకరిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులను, సన్నిహితులను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

అక్కడ హైటెన్షన్

అక్కడ హైటెన్షన్


టోలిచౌకి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దానిని ఆనుకుని ఉన్న పారామౌంట్‌ కాలనీ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారికి అడ్డాగా మారింది. సోమాలియా, నైజీరియా, కెన్యా తదితర ఆఫ్రికా దేశాల నుంచి ఆస్పత్రుల్లో చికిత్స కోసం, విద్యార్థులుగా, ఇతర పనుల కోసం నగరానికి వచ్చి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడికి సమీపంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ప్రముఖ ఆస్పత్రులు ఉండడం, తమకు నచ్చిన ఫుడ్ దొరుకుతుండడంతో ఆఫ్రికన్లు పారామౌంట్‌ కాలనీలోనే ఎక్కువగా ఉంటున్నారు.

 ఆర్టీపీసీఆర్ పరీక్షలు

ఆర్టీపీసీఆర్ పరీక్షలు

ఇక్కడ ఒమిక్రాన్‌ కేసులు బయటపడటంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు పారామౌంట్‌ కాలనీలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల వేగం పెంచారు. గోల్కొండ క్లస్టర్‌ సీనియర్‌ మెడికల్‌ అధికారి అనూరాధ ఆధ్వర్యంలో కాలనీ గేట్‌ నెంబర్‌ 1, 4 ప్రాంతాలు, చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని నివాసితుల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపారు. శుక్రవారం మొత్తం 169 మందికి పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్య సిబ్బంది తెలిపారు.

అలర్ట్

అలర్ట్

జూబ్లీహిల్స్, బంజరా హిల్స్.. యూసుఫ్ గూడా వద్ద కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. టోలిచౌకిలో 25-30 ఇళ్ల మధ్య కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నిన్నటివరకు రాష్ట్రంలో 9 కేసులు వెలుగుచూశాయి. హన్మకొండ మహిళ, హైదరాబాద్‌కు చెందిన ఒకరి వల్ల 9కి చేరింది.

English summary
these places in the hyd city found omicron positive state health officials said to media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X