• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జూ పార్కులో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్..!

|

హైదరాబాద్ : నెహ్రు జూలాజికల్ పార్కులో దొంగలు పడ్డారు. పార్కులో దొంగలు పడటమేంటి.. అక్కడ ఎత్తుకెళ్లడానికి ఏముంటాయనే సందేహం రావొచ్చు. కానీ ఆ చోరాగ్రేసరులు ఏం దోచుకెళ్లారో తెలిస్తే షాక్‌కు గురికావాల్సిందే. అదలావుంటే జూ పార్కులో దొంగలు పడ్డారనే విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. చివరకు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ పని ఎవరిదబ్బా అని ఆరా తీసే పనిలో పడ్డారు.

జూ పార్కులో చోరీలు కొత్తేమీ కాదు..!

జూ పార్కులో చోరీలు కొత్తేమీ కాదు..!

జూ పార్కు దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. లోనికి వెళ్లాలంటే సవాలక్ష తీరుగా విజిటర్స్‌ను తనిఖీలు చేస్తారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జనాలతో కిటకిటలాడుతుంటుంది. అలాంటిది జూ పార్కులో దొంగలు పడ్డారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. అయితే గతంలో చోరీలు జరిగినా.. ఈసారి దొంగతనం జరిగిన తీరు విస్మయం కలిగిస్తోంది.

జూ పార్కులో దొంగతనాలు కొత్త కాదు. కొందరు గోడలు దూకి వస్తారనే టాక్ ఉంది. అయినా ఏనాడు కూడా అలాంటి వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవంటారు. వారంతా స్థానికులు కావడంతో గొడవలు ఎందుకులే అని జూ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తారనే ప్రచారముంది. అయితే ఇలా నిర్లక్ష్యంగా వహించడంతోనే దొంగతనాలకు ఆస్కారం ఏర్పడుతోందనే వాదనలు లేకపోలేదు.

కలెక్టరేట్ నుంచి వచ్చా.. మీ ఆధార్ తప్పులు సరిదిద్దుతా.. పెద్ద బొక్క పెట్టాడుగా..!

 జంతువులకు హాని కలిగించకుండా.. చోరీలే టార్గెట్

జంతువులకు హాని కలిగించకుండా.. చోరీలే టార్గెట్

గతంలో పలుమార్లు దొంగలు జూ పార్కులోకి ప్రవేశించి విలువైన అటవీ సంపదను దోచుకెళ్లిన ఘటనలున్నాయి. అయితే జంతువులను మాత్రం ఏమి అనకుండా జాగ్రత్త పడుతున్నారు. దానికి కారణం జంతువులకు హాని కలిగితే అధికారులు కూడా సీరియస్‌గా తీసుకుంటారనే ఉద్దేశం కావొచ్చేమో. చోరీలైతే కేసులు మాత్రం బుక్ చేసి అంతవరకు ఆ ఇష్యూని వదిలేస్తారని దొంగలు ఆలోచిస్తున్నారేమోననే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు జూ పార్కులోకి చొరబడ్డారు. విలువైన గంధం చెట్లను నరికి తీసుకెళ్లారు. ఆదివారం నాడు పార్కు మూసివేసిన అనంతరం సిబ్బంది వెళ్లిపోయారు. అయితే అదను చూసి అర్ధరాత్రి దాటిన తరువాత కిషన్‌బాగ్ ప్రాంతం వైపు నుంచి జూలోకి కొందరు దుండగలు చొరబడ్డారని చెబుతున్నారు అసిస్టెంట్ క్యూరేటర్ సందీప్.

ఆ దొంగల పనేనా ఈసారి కూడా..!

ఆ దొంగల పనేనా ఈసారి కూడా..!

జూ పార్కులో దొంగలు పడ్డ ఘటనపై అధికారులు బహదూర్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంధపు చెక్కలను దొంగిలించిన వారి కోసం వేట మొదలు పెట్టారు. ఆ క్రమంలో జూ పార్కులోని సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు. అదలావుంటే జంతువులకు ఎలాంటి హాని తలపెట్టలేదని, కేవలం గంధపు చెట్లను మాత్రమే నరికివేశారని పోలీసులు తెలిపారు. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని తెలిపారు.

జూ పార్కులో ఇదివరకు కూడా గంధం చెట్లను నరికి ఎత్తుకెళ్లారనే టాక్ వినిపిస్తోంది. ఆ దొంగలే ఈసారి కూడా గంధం చెక్కల చోరీకి ప్రయత్నించారేమోనని అనుమానం వ్యక్తం చేశారు అసిస్టెంట్ క్యూరెటర్ సందీప్. ఆ మేరకు చోరీ జరిగిన తీరును పోలీసులకు వివరించారు. ఆ క్రమంలో జూ పార్కు పరిసర ప్రాంతాల్లో ఉన్న కొందరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీ పరిశీలిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. అదలావుంటే గంధం చెక్కలే ఎత్తుకెళ్లారా.. లేదంటే ఇంకేమైనా చోరీ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Thieves stolen sandal wood from hyderabad nehru zoological park. The zoo officials complaints to police. They filed case and seeing cctv footage, says that try to arrest the thieves as soon as possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more