• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హోటల్ గదిలో మూడో వ్యక్తి: సీసీటీవీ ఫుటేజీ ఏదీ..? లవర్స్ మృతిపై ఫ్యామిలీ డౌట్స్..

|

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రేమజంట మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రాథమికంగా ప్రియుడు.. ప్రేయసిని చంపి, ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కానీ మృతుల ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అబ్జెక్షన్ చేస్తున్నారు. హోటల్‌లో వారిద్దరూ కాక మూడో వ్యక్తి ఉండి ఉంటారని చెబుతున్నారు. వారిద్దరూ హోటల్ గదిలో ప్రవేశించిన తర్వాత.. సీసీటీవీ ఫుటేజీ ఎందుకు కనిపించడం లేదని అడుగుతున్నారు. దీనికి పోలీసులు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో కుటుంబసభ్యుల అనుమానాలు నిజమేనా అనిపిస్తోంది. దీనిపై మరింత లోతుగా జరపాల్సిన అవసరం ఉంది. ఏం జరిగిందో వారికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది.

 ఇవీ అనుమానాలు.. మరీ ఫుటేజీ

ఇవీ అనుమానాలు.. మరీ ఫుటేజీ

మాదాపూర్‌లో గల లెమన్ ట్రీ హోటల్‌లో గురువారం ప్రేమజంట చనిపోయారు. ఘటనపై అనుమానాలు ఉన్నాయని మృతుల కుటుంబసభ్యులు అంటున్నారు. హోటల్‌ గదిలో ఇంకెవరైనా ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు సంతోషి సోదరుడు రాఘవేంద్ర పలు అనుమానాలు ఉన్నాయని చెప్పాడు. కానిస్టేబుల్‌ ఉద్యోగం కోచింగ్‌ కోసం చెల్ల 15 రోజుల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చిందని వివరించారు. ఇంతలోనే ఇలా జరిగిందని ఆయన వెర్షన్. ఇటు రాములు ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం లేదని అతని ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. హోటల్ గదిలో మూడో వ్యక్తి ఉంటారని.. వారే హత్య చేసి ఉంటారని సస్పెక్ట్ చేస్తున్నారు.

 గొంతు కోసుకున్న తర్వాత.. ఉరా..?

గొంతు కోసుకున్న తర్వాత.. ఉరా..?

గొంతు కోసుకున్న తర్వాతే రాములు ఉరేసుకున్నాడని పోస్టుమార్టంలో వైద్యులు స్పష్టంచేశారు. స్వరపేటిక తెగినట్లు పోస్టుమార్టంలో రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. స్వరపేటిక తెగిన వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకునే అవకాశం ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై పోలీసులను వివరణ అడగగా ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. దీంతో అనుమానం మరింత బలపడుతోంది. సంతోషి, రాములు హోటల్‌ గదిలోకి రావడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వారిద్దరూ చనిపోయిన రోజు గది బయట రికార్డయిన సీసీటీవీ కెమెరా దృశ్యాలను పోలీసులు బహిరంగ పరచడం లేదు. దీంతో అక్కడికి ఎవరు వచ్చారు. ఆ మూడో వ్యక్తి ఎవరు అనే అనేమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ కేసులో ఆ విజువల్ కీలకంగా మారబోతున్నాయి. కేసు సీరియస్ నెస్ దృష్ట్యా మాదాపూర్‌ పోలీసులు.. రాములు, సంతోషి కాల్‌డేటాపై ఫోకస్ చేశారు. ఇద్దరు మృతి చెందడానికి ముందు ఎవరెవరితో కాంటాక్టులో ఉన్నారునే అంశాలను పరిశీలిస్తున్నారు.

జాబ్ వస్తుందని అనుకుంటే..

జాబ్ వస్తుందని అనుకుంటే..

సంతోషి ప్రభుత్వ ఉద్యోగం తసాధించి కుటుంబానికి అండగా ఉంటుందని భావించామని ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. చదువులో చురుగ్గా ఉండటంతో తమ కల నెరవేరుతుందని అనుకున్నామని చెప్పారు. కానీ అంతలోనే అందనంత దూరం వెళ్లిపోయిందని మార్చురీ వద్ద సంతోషి ఫ్యామిలీ బోరున విలపించారు. గతంలో స్వల్ప మార్కులతో కానిస్టేబుల్‌ జాబ్ రాలేదని చెప్పారు. ఈ సారి మరింత పట్టుదలతో సాధించేందుకు కృషి చేస్తోందని.. కానీ ఇంతలోనే ఇలా జరిగిందని లోపలిని నుంచి వస్తోన్న దు:ఖాన్ని వస్తోన్న దిగమింగుకుని మరీ చెప్పారు. సంతోషికి తండ్రి లేడు. తల్లి ప్రోత్సాహంతో.. ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరిలు చదువులను మధ్యలోనే వదిలేసి మరీ సంతోషిని చదివించారని రాఘవేంద్ర తెలిపారు. తన సోదరినీ ఇద్దరిని ఎదుర్కొనే శక్తి ఉందని.. చనిపోయేంత పిరికిది కాదని చెప్పారు. ఎదుటి వ్యక్తి చంపేందుకు ప్రయత్నించినా వారి నుంచి తప్పించుకునేంత ధైర్యం ఆమెలో ఉందన్నారు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని రాఘవేంద్ర తెలిపారు.

 ఇదీ నేపథ్యం..

ఇదీ నేపథ్యం..

వికారాబాద్‌ లగచర్ల గ్రామానికి చెందిన సంతోషి, మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గికి చెందిన రాములు చిన్ననాటి స్నేహితులు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వారిద్దరి కులాలు వేరుకావడంతో రాములు ఇంట్లో పెళ్లికి అభ్యంతరం తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని సంతోషి రాములుపై ఒత్తిడి తీసుకొచ్చేదని తెలుస్తోంది. దీని గురించి చర్చించడానికి బుధవారం మాదాపూర్‌లోని హోటల్‌కు వచ్చారు. ఆ రోజు ఇద్దరు గదిలో బాగానే ఉన్నారు. మరుసటి రోజు పెళ్లికి సంబంధించి డిస్కషన్ జరిగాయి. పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవట్లేదని, తానేమీ చేయలేని స్థితిలో ఉన్నానని రాములు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. సంతోషి మాత్రం పెళ్లికి పట్టుపట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పీక్‌కి చేరింది. క్షణికావేశానికి లోనైన రాములు సంతోషినిని బ్లేడ్‌తో గొంతుకోశాడని.. తీవ్రంగా రక్తం రావడంతో గొంతుకు టవల్‌ అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేసింది. అయినా రక్తం ఆగకపోవడంతో బాత్‌రూంలో పడిపోయింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అదే బ్లేడుతో రాములు గొంతుకోసుకున్నాడు. తర్వాత చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కానీ ఇద్దరి మృతిపై ఇరు కుటుంబాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే కొద్ది నెలల క్రితం ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై తమకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర ప్రసాద్‌ స్పష్టంచేశారు.

  Telangana Police 24/7 On Duty.. సిటీ అంతా CCTV - Talasani Srinivas Yadav
  కాల్ రికార్డ్స్

  కాల్ రికార్డ్స్

  జంట మృతి మాత్రం హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఒకరోజు బానే ఉన్న తర్వాత ఇద్దరు విగతజీవులుగా మారారు. ఇరు కుటుంబాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆ సీసీటీవీని పోలీసులు బహిర్గతం చేస్తే తప్ప.. ఏం జరిగిందో తెలియదు. ఇద్దరి హత్య వెనక గల అసలు నిజం తెలియదు. కాల్ రికార్డ్స్ కూడా పరిశీలిస్తున్నారు. వాటి ద్వారా కూడా ఏమైనా పోలీసులకు లీడ్ దొరికే ఛాన్స్ ఉంది. ప్రేమ జంట మృతి మాత్రం సిటీలో సంచలనం రేపింది.

  English summary
  in recent ramulu, santoshi were dead at hyderabad hotel. their families were objective of suicide.. in that hotel third person also living they alleged.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X