ఒమిక్రాన్ టెన్షన్: ఇవాళ మరో 12 కేసులు.. మొత్తం 79..
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ మరో 12 కేసులు వచ్చాయి. దీంతో కేసుల మొత్తం సంఖ్య 79కి చేరింది. వీరిలో 27 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకోగా.. 52 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా టిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. పాజిటివ్ వచ్చిన వారి.. కాంటాక్టులు ట్రేస్ చేసీ.. టెస్టులకు పుణెకు పంపిస్తున్నారు. పాజిటివ్ వస్తే వారిని కూడా టిమ్స్ తరలిస్తున్నారు.
రాజన్న సిరిసిల్లలో ఒక కేసు వచ్చిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వచ్చింది. దీంతో అతనిని టిమ్స్‌కు తరలించారు. అయితే అతని భార్య, అతని తల్లి, స్నేహితుడి నమూనాలను జినొమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా వారికి కూడా పాజిటివ్ వచ్చింది. ఆ ముగ్గురిని టిమ్స్ తరలించారు. ఈ మూడు కేసులతో జిల్లాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకి చేరింది.

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. గుంపులు గుంపులు ఉండొద్దని స్పష్టంచేసింది. తెలంగాణ రాష్ట్రంలో చాపకింద నీరులా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కోరోజు 10 వరకు కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఒమిక్రాన్ టెన్షన్‌తో నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కర్ఫ్యూ తప్ప మరో మార్గం లేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ జాబితాలో ఢిల్లీ కూడా చేరింది. ఇటు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది.












Click it and Unblock the Notifications