హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హీరో రామ్ చరణ్‌కు సోకిన కరోనా: సెట్‌లో కలకలం: అభిమానులు ఏం చెబుతున్నారంటే?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో రామ్‌ చరణ్‌కు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. తనకు కరోనా వైరస్ సోకిన విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తనలో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని తెలిపారు. రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షల సందర్భంగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నానని పేర్కొన్నారు. త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాననే ఆయన వ్యక్తం చేశారు.

Recommended Video

Ram Charan Tests Coronavirus Positive రామ్‌ చరణ్‌కు కరోనా.. RRR యూనిట్‌లో కలకలం | RRR Shooting

ఇదివరకు ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవికి కూడా కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం కరోనా నిర్ధారణ పరీక్షల్లో లోపాల వల్ల చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. రెండు రోజుల్లోనే ఆయన క్వారంటైన్‌ నుంచి బయటికి వచ్చారు. తాజాగా అలాంటి ఫలితమే రామ్‌చరణ్ విషయంలోనూ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా- తాను ఆరోగ్యంగా ఉన్నానని రామ్‌చరణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందవద్దని విజ్ఙప్తి చేశారు.

ramcharan

ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం రామ్‌చరణ్.. రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉంది. తాజాగా ఆయన కరోనా బారిన పడటం వల్ల సినిమా యూనిట్‌లో కలకలం రేపుతోంది. యూనిట్ సభ్యులు, తోటి నటీనటులు, టెక్నీషియన్లు కరోనా వైరస్ బారిన పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం.. సినిమా షూటింగ్‌లల్లో పాల్గొనే వారు ప్రతీరోజూ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా రామ్‌చరణ్ రోజూ టెస్ట్‌లను చేయించుకుంటున్నారు. తాజాగా ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ను చేయించుకోగా కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. షూటింగ్ సందర్భంగా ఆయనకు కరోనా సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

English summary
Tollywood actor Ram Charan tested Positive for Covid19
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X