రేపే ఇంటర్ ఫలితాలు.. 25న లేదంటే 26న పది ఫలితాలు
స్కూల్, కాలేజీలు ప్రారంభం అయ్యాయి. పది, ఇంటర్ విద్యార్థులు మాత్రం ఫలితాల కోసం చూస్తున్నారు. ఫలితాలపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇంటర్ పరీక్షా ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ ఏడాది 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను రాశారు. ఆన్సర్ షీట్స్ వాల్యూయూషన్ 14 కేంద్రాల్లో కొనసాగింది. రేపు విడుదల అయ్యే ఇంటర్ రిజల్ట్స్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ sbie.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ నుంచి ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఇంటర్ ఫలితాలకు సంబంధించి క్లారిటీ వచచింది. పదో తరగతి ఫలితాల విషయానికి వస్తే... ఆన్సర్ షీట్స్ మూల్యాంకనం ఇంకా కొనసాగుతోంది. టెన్త్ రిజల్ట్స్ ఈ నెల 25న లేదా 26న ప్రకటించే అవకాశం ఉంది. పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత ఇంటర్ ఫస్టియర్ క్లాసులు జులై 1 నుంచి ప్రారంభం అవుతాయి. ఇంటర్ సెకండియర్ క్లాసులు ఈ నెలలో ప్రారంభం అవుతాయి.

ఇప్పటివరకు అయితే పరిస్థితి బాగానే ఉంది. కానీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇదీ కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. స్కూల్, కాలేజీలు తెరచుకున్నాయి. పిల్లలు పాఠశాలకు వెళుతున్నారు. అయితే ఐఐటీ ఖరగ్ పూర్ శాస్త్రవేత్తలు మాత్రం జూన్ 22వ తేదీ నుంచి కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ఫోర్త్ వేవ్ పీక్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఆ మేరకు కేసుల పెరుగుదల కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications